cash for votes scam
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభం
ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించింది. ఇంతకుముందు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా.. పిటిషనర్లు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది. (ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు) చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదాపడింది. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకోవడం కోసం డబ్బులు ఇస్తూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు గొంతు కూడా వినిపించడం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్ధారించడంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కేసును పునర్విచారించి, అందులో చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. (ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే) దాంతో ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించాలని ఆదేశించగా, దానిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేను సవాలుచేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేసును నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ మొదలైంది. (హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు) -
ఓటుకు కోట్లు కేసులో వాదనలు ఇలా...
ఓటుకు కోట్లు కేసులో తనపై విచారణను రద్దు చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల్లో ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తొలుత వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్డే వాదనలు వినిపించారు. ప్రాథమిక వాదనలు ముగియగానే స్టే అండ్ నోటీసు ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. కేసు దర్యాప్తు జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టేపై తొలుత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే సుప్రీం స్టే ఉత్తర్వులు ఇవ్వగానే బాబు లాయర్ మళ్లీ వాదనలు వినిపించారు. ఏపీ సీఎంపై రాజకీయ ఉద్దేశాలతోనే కేసు పెట్టారని లూథ్రా చెప్పారు. ఒక ఎఫ్ఐఆర్లో దర్యాప్తు సాగుతుండగా మరో ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారన్నారు. ఏసీబీ కోర్టు సెక్షన్ 156, 210 కింద ఆదేశాలచ్చిందని, ఆ కోర్టు ఆదేశాలపై తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని అన్నారు. ఆ సమయంలో లూథ్రాను సుప్రీం జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారన్నారు. వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని ప్రశ్నించారు. దాంతో దర్యాప్తుపై హైకోర్టు 8 వారాల స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే మూడువారాలు పూర్తయిందని కూడా చెప్పారు. అందువల్ల హైకోర్టులోనే కేసు కొనసాగించమని చెప్పాలని ఆయన కోరగా.. ఆయన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. నాలుగువారాల్లోగా ఈ కేసును పరిష్కరించాల్సిందిగా హైకోర్టును ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆ సమయంలో ఏసీబీ, ఏపీ సీఎం అంటూ చంద్రబాబు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. అంతలో ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్డే వాదన ప్రారంభించారు. ఒక కేసు దర్యాప్తును ఆపమని చెప్పడం ఎంతవరకు సబబని, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో స్టే ఇవ్వడానికి వీల్లేదని ఆయన అన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలు ఇచ్చామని, చార్జిషీటులో్ చంద్రబాబు పాత్ర లేనందువల్లే మళ్లీ దర్యాప్తు కోరామని తెలిపారు. బాబు పాత్రను పరోక్షంగానే ప్రస్తావించారని, బాబు విషయంలో దర్యాప్తుపై మెతకగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాజీవితంలో నైతికత, నిబద్ధత అత్యంత ఆవశ్యకమని చెప్పారు. హైకోర్టులో వాదనలు వినిపించడానికి తమకు అభ్యంతరం ఏమీ లేదంటూ.. దర్యాప్తును స్టేలతో అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని తెలిపారు. నాలుగు వారాల్లోగా కేసును హైకోర్టు పరిష్కరించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దాంతో.. హైకోర్టు పరిష్కరించకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి రావాలని తెలిపారు. కచ్చితంగా నాలుగు వారాల్లోనే కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు. ఇది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారమని, కేసును జాప్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దశలో స్టే విధించడం సరికాదని ఆయన చెప్పారు. తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. అయితే.. కేసు విచారణపై హైకోర్టు 8 వారాల పాటుస్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబుకు ఎదురుదెబ్బ సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ అని ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి అన్నారు. స్టేలతో దర్యాప్తును ఆపాలని చంద్రబాబు చూశారని ఆయన అన్నారు. అయితే నాలుగు వారాల్లో ఓటుకు కోట్లు కేసును పరిష్కరించాలని సుప్రీం ఆదేశించిందని.. నాలుగు వారాలు దాటితే మళ్లీ తమ వద్దకు రావల్సిందిగా చెప్పిందని ఆయన తెలిపారు. -
ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?
గతంలో ఓటుకు కోట్ల కేసు తెరమీదకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తన మంత్రులను ఢిల్లీకి పంపించి అమిత్ షా నుంచి అరుణ్ జైట్లీ వరకు అందరితో చర్చించమని చెప్పారని, దానివల్లే ఆయన ఆ కేసు నుంచి కొంత కాలం బయటపడ్డారని.. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి డ్రామాలే చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. అప్పుడుకూడా కేంద్ర నేతలతో తాము చర్చించినది ప్రత్యేక హోదా కోసమేనని టీడీపీ ఎంపీలు కలరింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఓటుకు కోట్లు కేసు తెరమీదకు వచ్చిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబు మెడలో ఉరితాడు అలాగే ఉంది తప్ప ఆ తాడు ముడి ఊడిపోలేదని కాకాణి అన్నారు. అందుకోసమే ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా, ప్యాకేజి అంటూ టీడీపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అసలు ప్రత్యేక హోదా గురించి గానీ, ప్యాకేజి గురించి గానీ తనకు ఏమీ తెలియదని, జరుగుతున్నట్లు చెబుతున్న విషయాలేవీ తన దృష్టికి రాలేదని చంద్రబాబు అంటున్నారని చెబుతూ.. ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆమోదయోగ్యమైన ప్యాకేజి వస్తే తప్ప ఢిల్లీ వెళ్లేది లేదంటున్నారని.. మరోవైపు ఎంత వస్తే అంత రాబడదామని చంద్రబాబు అంటున్నట్లుగా మీడియాలో కథనం వచ్చిందని, ఈ డ్రామాలు ఎందుకని నిలదీశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు దానికి అయ్యే వ్యయంలో కేంద్రం వాటను 90 శాతానికి ఒప్పించామని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దక్కేది హోదానా, ప్యాకేజినా అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు డ్రామాలు ఆడటం ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడమా కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజితో డబ్బులొస్తే వాటిని ఎలా లూటీ చేయాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తే ప్రజలు లాభపడతారు తప్ప చంద్రబాబుకు వ్యక్తిగతంగా లాభం ఉండదు కాబట్టి ప్యాకేజితో దోచుకుందామని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రయో జనాల కో సం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని గోవర్ధనరెడ్డి అన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా.. చంద్రబాబు గట్టిగా కృషిచేసి ఈ మాత్రమైనా ప్యాకేజి రాబట్టారని కలరింగ్ ఇవ్వడానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం జరగడం లేదని తెలిపారు. నీతి నిజాయితీలతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని, అంతేతప్ప టీడీపీ - బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు రాకూడదనే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి హోదా సాధించాల్సిందేనని.. అంతవరకు కావాలంటే ఢిల్లీకి వెళ్లనని మొరాయించాలని, ఇంకా కావాలంటే మీ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి పోరాటం చేయాలని చంద్రబాబుకు కాకాణి సూచించారు. -
ఏసీబీ విచారణకు ఆటంకం లేదు
-
ఏసీబీ విచారణకు ఆటంకం లేదు: న్యాయవాది
ఏసీబీ కోర్టు జారీచేసిన మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదని.. అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టు ఇచ్చినది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పటినుంచో మాయమాటలు చెబుతూనే ఉన్నారని, కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. విచారణను ఎదుర్కోవాల్సిందిగా సవాలు చేశామన్నారు. విచారణలో నిర్దోషివని తేలితే ప్రజలందరికీ కడిగిన ముత్యానివే, నిప్పువే అని తెలుస్తుందని చెప్పామని ఆయన అన్నారు. కానీ.. దోషిగా తేలితే భవిష్యత్తు తన దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. అసలు ఏసీబీని ఆశ్రయించడానికి తనకు అర్హత లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారని.. కానీ న్యాయస్థానం మాత్రం తనను అనర్హుడిగా ప్రకటించలేదు, ఆయనను శాశ్వతంగా ఈ కేసు నుంచి బయట పడేయలేదని గుర్తు చేశారు. కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని అన్నారు. ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని ఆర్కే గుర్తుచేశారు. -
ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే
-
ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం కోర్టులో వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్టును ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో రేవంత్ రెడ్డి తరఫున బెయిల్ కోసం ఈయన వాదించారు. తొలుత ఆర్కే తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టూ అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని ఆయన వాదించారు. ఆయన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ మెమో ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్ 156 ఆర్డర్‌పై స్టే అడిగే హక్కు పిటిషనర్‌కు లేదని సుధాకర్‌రెడ్డి చెప్పగా, ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. అనంతరం ఏసీబీకోర్టు ఆదేశాలపై 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎమ్మెల్యే ఆర్కేలు సవివరమైన కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. సుప్రీంకు వెళ్తాం: ఆర్కే అయితే.. హైకోర్టు ఆదేశాలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు స్వరనమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగానే ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.