ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం కోర్టులో వాదనలు జరిగాయి.