జీడిగింజల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా పలాస ఇండస్ట్రీయల్ ఏరియాలోని జీడిగింజల నుంచి నూనె తీసే కర్మాగారంలో మంగళవారం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దాంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.