హైదరాబాద్‌కు జీడి వ్యాపారుల పంచాయితీ
పలాస: పలాస జీడి వ్యాపారుల సమస్య చివరికి హైదరాబాద్‌కు చేరింది. పలాస కాష్యూ మ్యానిఫేక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లా శ్రీనివాసరావు, మల్లా సురేష్‌కుమార్‌లు స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషతో పాటు శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్లి అక్కడ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఛాంబర్లో జిల్లా వాణిజ్య పన్ను ల శాఖ కమిషనర్ శ్యామలరావు, విజయనగరం డీసీ శ్రీనివాసరావు తదితరులు సమావేశమై పలాస జీడిపరిశ్రమదారుల పన్ను చెల్లింపు విషయంలో చర్చ లు జరిపారు.
మూడు నెలలుగా పలాస జీడిపరిశ్రమదారుల ఇళ్లపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు దాడు లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రోజు టీడీపీ నేత శిరీష సమక్షంలో వ్యాపారులు, కార్యకర్తలు వాణి జ్య పన్నుల శాఖాధికారులను అడ్డుకొని తిరిగి పంపించారు. ఆ తరువాత కలెక్టర్ సమక్షంలో కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు సమస్య వెళ్లింది. మంత్రి సమక్షంలో రాష్ట్ర కమిషనర్‌కు పలాస జీడి వ్యాపార ప్రతినిధులు జరిగిన విషయాన్ని చెప్పారు. మంత్రితో పాటు కమిషనర్ కూడా సానుకూలంతా స్పందించారని తెలిసింది. త్వరలోనే జీడి వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు పీసీఎంఎ అధ్యక్ష కార్యదర్శులు మల్లా శ్రీనివాసరావు, సురేష్‌కుమార్ చెప్పారు. పీసీఎంఎ గౌరవధ్యక్షులు బెల్లాల నారాయణరావు, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పలాస కాష్యూ లేబరు యూనియన్ కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి తదితరులు చ ర్చల్లో పాల్గొన్నారు.