catastrophe
-
Palestina: 75 ఏళ్లయినా.. గుండెల్లో అవే గుర్తులు, ఇంటికి తిరిగి రాగలమా?
గురక శబ్దం కఠోరంగా వస్తోంది. గాఢ నిద్రలో ఉన్నాడు. క్షణంలో తేడా. ఒక భారీ ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు. ఓ పీడ కల తనను విడిచిపెట్టనంటోంది. నిశి రాత్రి నుంచి సూర్యోదయం వరకు మళ్లీ కంటి మీద కునుకు రాలేదు. ఇలాంటి నిద్ర లేని రాత్రులు యాకుబ్‌కు ఎన్నో ఉన్నాయి. పుట్టి పెరిగిన గడ్డ నుంచి తననెందుకు తరిమెశారో తెలియని దుస్థితి యాకుబ్‌ది. ఒక్క యాకుబే కాదు ఏడున్నర లక్షల మందిది ఇదే పరిస్థితి. పాలస్తీనాలోని ఓ చిన్న పల్లె యాకుబ్ ది. అక్కడ దాదాపు వంద ఇళ్లుంటాయి. పచ్చటి కొండను ఆనుకుని కట్టుకున్న రాతి ఇళ్లను దూరం నుంచి చూస్తే.. ఓ అందమైన కాన్వాస్‌లా కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి 1948 వరకే. ఒక్క ఈ ఊరే కాదు. పక్కనే ఉన్న బోలెడు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు పిల్లాపాపలతో కళకళలాడిన ఊళ్లన్నీ ఖాళీ అయ్యాయి. అప్పటివరకు రాజులా బతికిన వాళ్లంతా శరణార్థులుగా మారిపోయారు. ఈ దుస్థితినే వాళ్లు నక్భా అంటారు. దానర్థం తరిమేయడం. 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటు తర్వాత పాలస్తీనాలో చాలా ఊళ్లు నిర్మానుష్యమయ్యాయి. కనిపించిన వాళ్లందరనీ తరిమేశారని యాకుబ్ లాంటి వాళ్లు చెబుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తన సొంత గడ్డను చూసుకోడానికి వస్తారు. ప్రతీ ఏటా ఇక్కడికి వచ్చే యాకుబ్‌లో ఇంకా ఆశ మిణుకు మిణుకు మంటూనే ఉంది. ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన ఈ ఊళ్లు .. ఇప్పుడు ఓ రిజర్వ్ ప్రాంతాలుగా మారిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటి మధ్య ఇంకా అందంగా కనిపిస్తోన్న ఆనాటి రాతి కట్టడాలు.. ఇవే యాకుబ్ లాంటి వారికి ఆక్సిజన్. 75 ఏళ్ల కిందినాటి తీపి గుర్తులను నెమరేసుకుంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. కనిపించిన వాళ్లందరికీ.. ఇదే నా ఇల్లు, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే ఆడుకున్నాను అంటూ చూపిస్తాడు యాకుబ్. Even after 75 years, Yacoub Odeh returns to his home abandoned during the Nakba, when his village was attacked by Zionist armed groups, forcing over 750,000 Palestinians to flee ⤵️ pic.twitter.com/j0f3dP8ObL — Al Jazeera English (@AJEnglish) May 24, 2023 "1948లో అందరం ఇళ్లలో ఉన్నాం. ఒక్కసారిగా బాంబులు పేలాయి. ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. ఇల్లు, వాకిలి, మంచి జీవితంతో రాజులా ఉన్న మేం.. ఒక్క గంట తేడాలో మేం శరణార్థులుగా మిగిలిపోయాం. మా ఇంటి నిండా భోజనం, మంచి దుస్తులు ఉండేవి. కానీ శరణార్థి క్యాంపుల్లో మాకు కనీసం కడుపు నిండా తినేందుకు లేని రోజులు ఎన్నో ఉండేవి. వేసుకోడానికి మంచి దుస్తులు లేక చలికి అల్లాడిపోయేవాళ్లం" అంటాడు యాకుబ్. ఏదో ఒక రోజు మా ఇంటికి మేం తిరిగి వస్తామన్న ఆశ యాకుబ్‌లో మిగిలి ఉంది. చచ్చిపోయేలోగా అది నెరవేరాలన్నది యాకుబ్ కల. 1948లో ఈ ఏరివేత జరిగినపుడు లక్షలాది కుటుంబాలు తమ వాళ్లను కోల్పోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు దేశాల్లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాల్లో లక్షలాది మంది అష్టకష్టాలు పడ్డారు. ప్రాంతం శరణార్థులు క్యాంపులు గాజా 14,80,000 8 వెస్ట్ బ్యాంకు 8,72,000 19 సిరియా 5,69,000 12 లెబనాన్ 4,80,000 12 జోర్డాన్ 23,07,000 10 నక్బా ఘటనలకు మే 15తో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాటి సంఘటనలకు, ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. -
'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Direct clash of NATO troops: ఒకవేళ రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగితే గనుక ప్రపంచానికి ప్రమాదకరమైన విపత్తు ఏర్పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కజకిస్తాన్ రాజధాని అస్తానాలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదీగాక గతనెలలో ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన తదనంతరం తమ రష్యా భూభాగాలను రక్షించడానికి ఎంతకైన తెగిస్తాం, అవసరమైతే అణ్వాయుధాలను సైతం ఉపయోగిస్తానంటూ.. వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని జీ7 దేశాలు తీవ్రంగా హెచ్చరించాయని వాషింగ్టన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జీ7 నాయకులు రష్యా ఉద్యేశపూర్వక దురాక్రమణ దాడిని, ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు వాటిల్లే పెద్ద ఎత్తున సాగించిన సైనిక సమీకరణ వంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. అంతేగాదు రష్యా రసాయన, జీవ సంబంధింత అణ్వాయుధాలను వినియోగిస్తోందేమోనని భయాందోళనలను కూడా వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్ నగరంలో నిధుల సేకరణ కోసం జరిగిన డెమోక్రటిక్ సెనేటోరియల్ క్యాంపెయిన్ కమిటీలో ప్రసంగిస్తూ...ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడాన్ని ఉద్దేశిస్తూ...ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారుతుందనుకోలేదన్నారు. అలాగే కెన్నడీ, క్యూబా క్షిపణి సంక్షోభంలో కూడా మహా సంగ్రామాన్ని చవిచూడలేదన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించే సామర్థ్యం గల రష్యా దురాక్రమణ యుద్ధానికి అడ్డుకట్టవేసే పరిష్కార మార్గం ఏముందే తెలియడం లేదన్నారు. వాస్తవానికి రష్యా సైన్యం తక్కువగా ఉంది, మరోవైపు ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు కూడా సాధించలేకపోతుంది కాబట్టి రష్యా ఎలాంటి దుశ్చర్యకైనా దిగే ప్రమాదం లేకపోలేదు అన్నారు. ఈ కారణాల రీత్యా పుతిన్ పెద్ద ఎత్తున్న ఆర్మీ సమీకరణ, అణ్వయుధాల దాడి వంటి బెదిరింపులకు దిగుతున్నాడంటూ విమర్శించారు. తాను అనుకున్నట్లుగా చేసేందుకు పుతిన్ ఏం చేసేందుకైనా వెనుకాడడు, పైగా ఏ చిన్న అవకాశాన్ని సైతం వదలుకోడని అన్నారు. అందువల్లే పుతిన్ తన ప్రతిష్టను దిగజార్చుకోవడమే కాకుండా రష్యాలో తన ప్రాభవాన్ని సైతం కోల్పోతున్నాడంటూ బైడెన్ తిట్టిపోశారు. (చదవండి: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్) -
ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో ఇప్పటికే వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్ర ప్రపంచ ఆకలి సంక్షోభం 2022 లో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కుటుంబాల్లో ఆకలి కేకల్ని రగిలించనుందని యూఎన్ చీఫ్ చెప్పారు. 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చన్నారు. బెర్లిన్‌లో ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల అధికారుల కిచ్చిన వీడియో సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, ఇంధన ధరలతో రైతులు సతమతమవుతున్నందున ఆసియా, ఆఫ్రికా, అమెరికా అంతటా పంటలు దెబ్బ తింటాయని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలే వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు సంక్షోభానికి కారణం కానున్నాయని తెలిపారు. ఈ సంక్షోభం, ఆకలి విపత్తుతో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిణామాలను తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై విధించిన పాశ్చాత్య ఆంక్షలు ఆహార కొరతకు కారణమని మాస్కో చేసిన వాదన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని బెర్లిన్ సమావేశంలో పాల్గొన్న జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ అన్నారు. 2021 అదే నెలల్లో రష్యా ఈ సంవత్సరం మే, జూన్లలో ఎక్కువ గోధుమలను ఎగుమతి చేసిందని బేర్బాక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి సంక్షోభానికి అనేక అంశాలు కారణమన్న గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతిచ్చారు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి సునామీగా పరిణమించిందన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుండి కీలకమైన వస్తువులను వెనక్కి తీసుకున్న రష్యాను క్షమించలేమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు. అనేక ఇతర దేశాలతో కలిపి రష్యాపై తాము విధించిన ఆంక్షల్లో ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, తదితరాలకు మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. -
అతిపెద్ద సంక్షోభంలో ప్రపంచం!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచం అతిపెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. యెమన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైజీరియా దేశాల్లోని రెండు కోట్ల మంది కరువు, ఆకలి దప్పికలతో అలమటించనున్నారని పేర్కొంది. దీనిపై అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయకపోతే ప్రజలు ఆకలి బాధలతో పాటు వివిధ వ్యాధులతో మరణించే అవకాశముందని ఐరాస మానవతావాద సంఘం చీఫ్ స్టీఫెన్ ఒబ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నాలుగు దేశాలకు వెంటనే నిధులు పంపించాలని ఐరాస భద్రతా మండలిలో విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తు నివారణకు వచ్చే జూలై వరకు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అక్కడి అభివృద్ధి పూర్తిగా మందగిస్తుందన్నారు. ఐదేళ్లలోపు వయసున్న 30 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయం ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. యెమన్లోని మొత్తం జనాభా 1.8 కోట్ల మందిలో 70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. అరబ్ దేశాల్లో పేద దేశమైన యెమన్ నుంచి గత రెండు నెలల్లో 48 వేల మంది వలసపోయారని తెలిపారు. ఇటీవల తన పర్యటన సందర్భంగా అక్కడి నేతలను, రెబెల్స్‌ను కలిసి సాయమందిస్తామని హామీ ఇచ్చినట్లు ఒబ్రియాన్ చెప్పారు. మానవతా కోణంలో చేస్తామన్న సాయాన్ని వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని తెలిపారు. అక్కడి నేతలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే మానవ సంక్షోభానికి బాధ్యత వహించక తప్పదన్నారు. అలాగే మూడేళ్ల పౌర యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన దక్షిణ సూడాన్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూడాన్‌లో కరువును మనుషులే సృష్టించారని చెప్పారు.