Direct clash of NATO troops: ఒకవేళ రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగితే గనుక ప్రపంచానికి ప్రమాదకరమైన విపత్తు ఏర్పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కజకిస్తాన్ రాజధాని అస్తానాలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదీగాక గతనెలలో ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన తదనంతరం తమ రష్యా భూభాగాలను రక్షించడానికి ఎంతకైన తెగిస్తాం, అవసరమైతే అణ్వాయుధాలను సైతం ఉపయోగిస్తానంటూ.. వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని జీ7 దేశాలు తీవ్రంగా హెచ్చరించాయని వాషింగ్టన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జీ7 నాయకులు రష్యా ఉద్యేశపూర్వక దురాక్రమణ దాడిని, ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు వాటిల్లే పెద్ద ఎత్తున సాగించిన సైనిక సమీకరణ వంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. అంతేగాదు రష్యా రసాయన, జీవ సంబంధింత అణ్వాయుధాలను వినియోగిస్తోందేమోనని భయాందోళనలను కూడా వ్యక్తం చేసింది.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్ నగరంలో నిధుల సేకరణ కోసం జరిగిన డెమోక్రటిక్ సెనేటోరియల్ క్యాంపెయిన్ కమిటీలో ప్రసంగిస్తూ...ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడాన్ని ఉద్దేశిస్తూ...ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారుతుందనుకోలేదన్నారు. అలాగే కెన్నడీ, క్యూబా క్షిపణి సంక్షోభంలో కూడా మహా సంగ్రామాన్ని చవిచూడలేదన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించే సామర్థ్యం గల రష్యా దురాక్రమణ యుద్ధానికి అడ్డుకట్టవేసే పరిష్కార మార్గం ఏముందే తెలియడం లేదన్నారు.
వాస్తవానికి రష్యా సైన్యం తక్కువగా ఉంది, మరోవైపు ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు కూడా సాధించలేకపోతుంది కాబట్టి రష్యా ఎలాంటి దుశ్చర్యకైనా దిగే ప్రమాదం లేకపోలేదు అన్నారు. ఈ కారణాల రీత్యా పుతిన్ పెద్ద ఎత్తున్న ఆర్మీ సమీకరణ, అణ్వయుధాల దాడి వంటి బెదిరింపులకు దిగుతున్నాడంటూ విమర్శించారు. తాను అనుకున్నట్లుగా చేసేందుకు పుతిన్ ఏం చేసేందుకైనా వెనుకాడడు, పైగా ఏ చిన్న అవకాశాన్ని సైతం వదలుకోడని అన్నారు. అందువల్లే పుతిన్ తన ప్రతిష్టను దిగజార్చుకోవడమే కాకుండా రష్యాలో తన ప్రాభవాన్ని సైతం కోల్పోతున్నాడంటూ బైడెన్ తిట్టిపోశారు.
(చదవండి: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్)
Comments
Please login to add a commentAdd a comment