సాక్షి ఇండియా స్పెల్బీ కేటగిరీ–2 విజేతలు వీరే
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్బీ–2016 (కేటగిరీ–2, తెలంగాణ) విజేతలను శనివారం ప్రక టించారు. వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు సంబంధించి.. ఫైనల్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సాక్షి ఇండియా స్పెల్బీ సీఈవో శంకర్నారాయణ, బీ మాస్టర్ విక్రమ్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారికి ఇంగ్లిష్లో ఉన్న పట్టును ఈ పోటీలు నిరూపించాయని.. గొప్ప ఆత్మ విశ్వాసాన్ని కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
ముగ్గురు విజేతలు..
ళీ ‘సాక్షి’ ఇండియా స్పెల్బీ పోటీల్లో ప్రథమ బహుమతిని హైదరాబాద్లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అరిత్రోరాయ్ సొంతం చేసుకున్నాడు. అతడికి బంగారు పతకంతో పాటు రూ.15 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు.
ద్వితీయ బహుమతిని హైదరాబాద్లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అస్మిఘోష్ సాధించారు. అస్మిఘోష్కు రజత పతకంతో పాటు రూ.10 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు.
తృతీయ బహుమతిని హైదరాబాద్లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న సుమధుర సాధించారు. ఆమెకు కాంస్య పతకంతో పాటు రూ.5 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ప్యాక్ అందజేశారు.