CBL
-
కొత్త కస్టమర్లకు ఆచితూచి రుణాలు
సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రుణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఇందుకోసం వడ్డీ లేని రుణాలను జీరో డౌన్‌పేమెంట్‌తో ఆఫర్ చేయడం చూశాం. కోవిడ్–19 పుణ్యమాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇబ్బడిముబ్బడిగా రుణాలను అందించిన ఈ సంస్థలు పాత బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టిసారించాయి. దీంతో నూతన వినియోగదార్లకు రుణం దొరకడం కష్టంగా మారింది. వీరి విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్ ట్రాక్ రికార్డు ఆధారంగానే తాజాగా రుణాలను జారీ చేస్తున్నాయి. కీలకంగా సిబిల్ స్కోరు.. వినియోగదారులకు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటే లోన్ మంజూరు చేసేవి. నూతన మార్పుల ప్రకారం లోన్ కోసం వచ్చే కొత్త కస్టమర్‌కు ఇప్పుడీ స్కోరు కనీసం 775 ఉండాల్సిందే. లేదంటే సింపుల్‌గా నో అని చెప్పేస్తున్నాయి. పాత కస్టమర్ల విషయంలో సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటేచాలని ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గతంలో వారు తీసుకున్న రుణాల తాలూకు చెల్లింపులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లలో 35 శాతంగా ఉన్న ఈఎంఐల వాటా ఇప్పుడు 10 శాతానికి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లకు సౌకర్యంగా.. బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం 18 నెలల వరకు రుణాన్ని చెల్లించే సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. గతంలో ఇది 6–10 నెలల వరకే ఉండేదని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించా రు. ‘కోవిడ్–19 తర్వాత వినియోగదార్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం వాయిదాల సంఖ్యను పెంచాం’ అని ఆయన అన్నారు. అయితే గతంలో జీరో డౌన్‌పేమెంట్ ఉండేది. ఇప్పుడు కనీసం 30–35 శాతం ముందుగా చెల్లించాల్సిందే. బ్రాండ్, రుణ సంస్థనుబట్టి కస్టమర్ల నుంచి స్వల్ప వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని రుణ సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు చార్జీ చేస్తున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. -
‘హలో.. కోహ్లిని కాపీ కొట్టకు’
కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కాపీ కొట్టడం అంటే అతడిలా ఫొటోలు దిగడం కాదని... కోహ్లిలా పరుగులు వరద పారించాలని కామెంట్లు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హఫీజ్‌ను శ్రీలంక-పాకిస్తాన్ సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ప్రపంచకప్‌లో కూడా చెత్త ప్రదర్శన కనబరచడంతో మేజర్ కాంట్రాక్టుల విషయంలో పీసీబీ అతడిని పక్కన పెట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం కరేబియన్ లీగ్‌లో భాగంగా హఫీజ్ మైదానంలో దిగాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున అతడు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా తాను బస చేస్తున్న హోటల్లోని స్మిమ్మింగ్పూల్లో హఫీజ్ ఫొటోలు దిగాడు. సెయింట్ లూయీస్ వద్ద అందమైన సూర్యాస్తమయం అనే క్యాప్షన్‌తో వాటిని ట్విటర్లో షేర్ చేశాడు. అయితే విరాట్ కోహ్లి మాదిరి హఫీజ్ కూడా షర్ట్‌లెస్ ఫొటోలకు ఫోజులివ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘హలో కోహ్లిని కాపీ కొట్టాలంటే అతడి లాగా ఆటలో విజృంభించు. ఇలా ఫొటోలు కాపీ కొట్టకు. అయినా టీమ్ నుంచి తప్పించారన్న బాధే లేదు నీకు. పోనీ ఓ పని చెయ్. రిటైర్మెంట్ తీసుకో. హాయిగా లీగ్ మ్యాచ్‌లు ఆడుకుంటూ కాలం వెళ్లదీయ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. Sunset view in Beautiful St Lucia 😍 pic.twitter.com/5zECepAoJd — Mohammad Hafeez (@MHafeez22) September 21, 2019 -
నవంబర్ 4న సీబీఎల్ షురూ
సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) నవంబర్ 4నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీడీకే గ్లోబల్ కంపెనీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పీజీబీఏలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.