క్వార్టర్స్‌లో నిఖిత, తనుషిత
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ సౌత్‌జోన్ టెన్నిస్ టోర్నమెంట్లో నిఖిత, తనుషిత క్వార్టర్స్‌లో ప్రవేశించారు. సైనిక్‌పురిలోని ఇండస్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తనుషిత రెడ్డి (భవన్స స్కూల్) 6-0తో వింధ్య (ఓక్రిడ్‌జ ఇంటర్నేషనల్ స్కూల్)పై గెలుపొందగా... నిఖిత (గ్లెండాల్ అకాడమీ) 7-3తో విదిషా రెడ్డి (గ్లోబల్ ఎడ్జ స్కూల్)ను ఓడించింది. డబుల్స్ విభాగంలో అనన్య-దర్శిని(ఓక్రిడ్‌జ) ద్వయం 6-3తో సొనాలి జైస్వాల్-నిఖిత (భవన్స స్కూల్) జోడీపై, మాన్య విశ్వనాథ్-విదిషా రెడ్డి (గ్లోబల్ ఎడ్జ స్కూల్) ద్వయం 6-0తో నిఖిత-నిక్కి వర్మ (గ్లెండాల్ అకాడమీ) జోడీపై, సహస్ర-రెనీ శర్మ (చిరెక్ స్కూల్) 6-1తో చార్వి-మేఘన (డీపీఎస్, కర్నాటక)జోడీపై నెగ్గాయి.
ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు
అండర్-19 బాలికల సింగిల్స్: అనన్య (ఓక్రిడ్‌జ) 6-0తో సొనాలి జైస్వాల్ (భవన్స స్కూల్)పై, మాన్య (గ్లోబల్ ఎడ్జ స్కూల్) 6-0తో నిక్కి వర్మ (గ్లెండాల్ అకాడమీ) విజయం సాధించారు.
అండర్-14 బాలుర సింగిల్స్: రోహన్ (గ్లోబల్ ఎడ్జ స్కూల్) 6-0తో అభిజిత్ (వలమ్మల్ ఇంటర్నేషనల్ స్కూల్, తమిళనాడు)పై గెలుపొందాడు.
అండర్-19 బాలుర సింగిల్స్: రోహన్ (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్) 6-1తో అశ్విన్ (చెట్టినాడు విద్యాశ్రమ్, తమిళనాడు)పై నెగ్గాడు.