మిరాకిల్ బేబీకి మెమరబుల్ గిఫ్ట్
హైదరాబాద్: విమానంలో పుట్టిన 'మిరాకిల్ బేబీ'కి పిలిప్పీన్స్ కు చెందిన సెబూ పసిఫిక్ ఎయిర్ మెమరబుల్ కానుక ఇచ్చింది. తమ సంస్థ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న విమానంలో బుధవారం ఓ మహిళ పాపాయికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, ఇద్దరు నర్సుల సహాయంతో ఆమెకు సులభ ప్రసవం జరిగింది. తర్వాత విమానాన్ని హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపి తల్లీబిడ్డలిద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సెబూ పసిఫిక్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి.
తమ విమానంతో పుట్టిన చిన్నారి ఉచితంగా 10 లక్షల ఎయిర్ మైల్లు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని సెబూ పసిఫిక్ ఎయిర్ సీఈవో లాన్స్ గొకొంగ్వీయ్ వెల్లడించారు. ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవడానికి గడుపు పెట్టలేదని, పాపాయి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయొచ్చని చెప్పారు.
'తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. మా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళకు సహాయం అందించారు. సులభ ప్రసవానికి సాయం చేసిన ఇద్దరు నర్సులకు ధన్యవాదాలు తెల్పుకుంటున్నామ'ని లాన్స్ గొకొంగ్వీయ్ పేర్కొన్నారు. 1990లో ఘనా-యూకే బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో పాపాయికి జన్మనిచ్చిన డెబ్బీ ఓవెన్ అనే మహిళ తన కూతురికి ఆకాశం అనే అర్థం వచ్చేలా షోనా కిరిస్టీ వైవెస్ (స్కై) పేరు పెట్టింది. ఈ పేరులోని మొదటి అక్షరాలన్నీ కలిపితే స్కై అవుతుంది. విమానం గాల్లో ఉండగా మిరాకిల్
#CEBNews: Cheers to #BabyHaven, born inflight! To celebrate, we give her 1M @GetGoPH points! https://t.co/F7exzSO3qj pic.twitter.com/qkP1jxiEAT
— Cebu Pacific Air (@CebuPacificAir) 17 August 2016