celeberetated
-
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
రామన్నపేట వినాయకచవితి, బక్రీద్‌వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ ప్యారసాని శీనయ్య కోరారు. బుధవారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన శాంతిసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని, మంటపాల ఏర్పాటుకు పోలీస్‌శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. శబ్దకాలుష్యానికి కారణమయ్యే డీజేల ఏర్పాటుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఉదయం ఆరుగంటలనుంచి రాత్రి పదిగంటలవరకు మాత్రమే మైక్‌ను ఉపయోగించ వలసి ఉంటుందని చెప్పారు. సమావేశంలో పీఎస్ఐ పైడినాయుడు, సర్పంచ్ నకిరేకంటి మొగులయ్య, వివిధపార్టీల నాయకులు బందెల రాములు, బట్టె క్రిష్ణమూర్తి, మీర్జా బషీర్‌బేగ్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, ఎండీ నాజర్, జమీరుద్దిన్, గొలుసుల ప్రసాద్, ఎం.శంకర్, మన్సూర్‌అలీ, బండ లింగస్వామి, మిర్యాల మల్లేశం పోలీస్‌సిబ్బంది ఆరోగ్యరాజ్, నర్సింహ, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఘనంగా మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు
కోదాడఅర్బన్: దేశంలో అనాథలకు, అభ్యాగులకు సేవలందించి విశ్వమాతగా పేరుపొందిన మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఆమె విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని తేజ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మదర్ థెరిస్సా వేషధారణలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పరిధిలోని మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకోసం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు పండ్లు, బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మట్లాడుతూ మదర్ థెరిస్సా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కత్రం నాగేందర్‌రెడ్డి, సయ్యద్ ముస్తఫా, సంజీవ్‌రెడ్డి, రవి, తేజ పాఠశాల డైరక్టర్ జానకిరామయ్య, ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.