భాగ్యనగరిలో 'సెల్కాన్' యూనిట్
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్.. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్ ను స్థాపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో సెల్ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంటు నెలకొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్లాంటులో ప్రస్తుతం నాలుగు లైన్లను ఏర్పాటు చేశారు. పది రోజుల్లో మరో నాలుగు లైన్లు జోడించనున్నారు. ఒక్కో లైన్లో 8 గంటల్లో 2,500 ఫోన్లు అసెంబుల్ చేయవచ్చు. తొలుత నెలకు 3 లక్షల ఫోన్లను అసెంబుల్ చేస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు 'సాక్షి' బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు.
మొబైల్స్ హబ్లో ప్లాంటు ఏర్పాటయ్యే వరకు ఇక్కడే అసెంబుల్ చేస్తామని చెప్పారు. దశల వారీగా మేడ్చల్ ప్లాంటులో సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా వారం రోజుల్లో ప్లాంటును ప్రారంభింస్తామని పేర్కొన్నారు.