వ్యక్తిని బలిగొన్న సిమెంట్ ట్యాంకర్
పరిగి :
సిమెంట్ ట్యాంకర్ మోపెడ్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పరిగి మం డల పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ప్రత్యక్షసాక్షులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన ఊరడి పాండు(35) పరిగి పట్టణంలోని తుంకలగడ్డలో సొంతంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన అక్కడే ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కాం ట్రాక్ట్ ప్రాతిపదికన వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన పని నిమిత్తం మోపెడ్‌పై మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో గ్రా మ సమీపంలో పరిగి వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి మోపెడ్‌ను ఢీకొంది.
ప్రమాదంలో మెపెడ్ ధ్వంసమై పాండు ట్యాం కర్ వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య జయమ్మ, కుమారుడు మధుసూదన్(8), కూతురు మానస(4) ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.