cements company
-
సాగర్ సిమెంట్స్ చేతికి ఆంధ్రా సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ ఇక సాగర్ సిమెంట్స్ పరం కానుంది. ఈ మేరకు విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. జేపీ గ్రూప్ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్స్ ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. సాగర్ సిమెంట్స్ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు అనుకూలంగా ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీవోసీ) మెజారిటీతో ఓటు వేసింది. సాగర్ సిమెంట్స్ ప్రణాళికను సీవోసీ ఆమోదించింది. పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ పిటిషన్ ఆధారంగా ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గతేడాది ఏప్రిల్‌లో ఆదేశించింది. ఆంధ్రా సిమెంట్స్‌కు దాచేపల్లి సమీపంలో, అలాగే విశాఖపట్నం వద్ద ఒక్కో ప్లాంటు ఉంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
రామ్‌కో సిమెంట్స్‌కు సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద రెండు విభాగాల్లో సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు దక్కించుకుంది. అరియలూర్ ప్లాంట్‌కు వాటర్ శానిటైషన్ అండ్ హైజీన్(వాష్) అవార్డు, ఆర్ఆర్ నగర్ ప్లాంట్‌కు ఎంప్లాయి వాలంటీరింగ్ ఇనీషియేటివ్ అవార్డులు లభించాయి. సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజంలో మెరుగైన ఫలితాలను సాధించే కంపెనీలను సీఎస్‌ఆర్‌బాక్స్ ఈ అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంటుంది. సీఎస్ఆర్ను నిర్భంధంగా కాకుండా ఓ బాధ్యతగా రామ్‌కో సిమెంట్స్ భావిస్తుందని సీఈవో ఏవీ ధర్మకృష్ణన్ తెలిపారు. గత 60 ఏళ్లుగా కంపెనీ స్థాపించిన నాటి నుంచి సీఎస్ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
సిమెంట్ కంపెనీ సిబ్బందిపై టీడీపీ నేతల దాడి
నిలువరించే ప్రయత్నం చేయని పోలీసు యంత్రాంగం సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుండగా... ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనమిది. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ స్థాపించేందుకు ముందుకు వచ్చిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. భూములను విక్రయించిన రైతులను రెచ్చగొట్టి వాటిని కబ్జాచేసుకుని సాగు చేసుకోవాలంటూ తప్పుదారి పట్టిస్తున్నారు. సాగును అడ్డుకున్న కంపెనీ సిబ్బందిపై దాడిచేసిన సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయిపాలెం గ్రామంలో జరిగింది. సిమెంట్ కంపెనీ స్థాపనకు సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఈ ప్రాంతానికి చెందిన రైతుల నుంచి 800 ఎకరాల వరకు భూములను కొనుగోలు చేసింది. కంపెనీ స్థాపనకు టీడీపీ మద్దతుదారులు కొంతకాలంగా అనేక ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన పొలాల్లో టీడీపీకి చెందిన కొందరు రైతులు పత్తిపంట వేశారు. ఈ విషయం తెలిసిన సిమెంట్స్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ట్రాక్టర్ల సహాయంతో ఆ పంటను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిని నిలిపి వేసేందుకు టీడీపీకి చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వారిపై దాడికి దిగారు. కర్రలు, గొడ్డళ్లు, పెట్రోలు సీసాలను తీసుకుని తొలగిస్తున్న వారిపై దాడి చేశారు. యాజమాన్యం ప్రతినిధులపైనా రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు.