నిలువరించే ప్రయత్నం చేయని పోలీసు యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుండగా... ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనమిది. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ స్థాపించేందుకు ముందుకు వచ్చిన సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. భూములను విక్రయించిన రైతులను రెచ్చగొట్టి వాటిని కబ్జాచేసుకుని సాగు చేసుకోవాలంటూ తప్పుదారి పట్టిస్తున్నారు. సాగును అడ్డుకున్న కంపెనీ సిబ్బందిపై దాడిచేసిన సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయిపాలెం గ్రామంలో జరిగింది.
సిమెంట్ కంపెనీ స్థాపనకు సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఈ ప్రాంతానికి చెందిన రైతుల నుంచి 800 ఎకరాల వరకు భూములను కొనుగోలు చేసింది. కంపెనీ స్థాపనకు టీడీపీ మద్దతుదారులు కొంతకాలంగా అనేక ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన పొలాల్లో టీడీపీకి చెందిన కొందరు రైతులు పత్తిపంట వేశారు. ఈ విషయం తెలిసిన సిమెంట్స్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ట్రాక్టర్ల సహాయంతో ఆ పంటను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిని నిలిపి వేసేందుకు టీడీపీకి చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వారిపై దాడికి దిగారు. కర్రలు, గొడ్డళ్లు, పెట్రోలు సీసాలను తీసుకుని తొలగిస్తున్న వారిపై దాడి చేశారు. యాజమాన్యం ప్రతినిధులపైనా రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు.
సిమెంట్ కంపెనీ సిబ్బందిపై టీడీపీ నేతల దాడి
Published Wed, Oct 8 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement