central China
-
ఆ చెట్టుకు 1,300 సంవత్సరాలు
బీజింగ్: చైనాలో అంతరించి పోతున్న ఓ అరుదైన వృక్షాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ వృక్షానికి 1,300 ఏళ్ల చరిత్ర ఉంటుందన వారు తెలిపారు. అంతరించిపోతున్న పురాతన వృక్షాలను లెక్కిస్తున్న చర్యల్లో భాగంగా మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈ వృక్ష జాతని గుర్తించారు. షన్వాంగ్షాన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్లో ది టాక్సస్ అనే చైనాలోని ఈ ప్రత్యేక వృక్షం కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ వృక్షం 35 మీటర్లు ఎత్తు ఉందని దాని కాండం 2.2 మీటర్ల వ్యాసార్థం ఉందని దీనికి ఇరు వైపులా రెండు ఉప వృక్షాలు ఉన్నట్లు తెలిపారు. ఈ మూడు వృక్షాలను స్థానికులు ఎంతో ప్రేమగా సంరక్షిస్తున్నారని వివరించారు. -
19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి
-
19 రోజుల్లో 57 అంతస్తుల అందాల భవంతి
యమాస్పీడుగా బిల్డింగ్ను కట్టినా ప్రతీరోజూ ఎన్ని అంతస్తులు కట్టగలం? మామూలుగా అయితే ఒకటి. కానీ ఈ ఫోటోలోని బిల్డింగ్ను రోజుకు మూడంతస్తుల చొప్పున పూర్తి చేశారు. కేవలం 19 పనిదినాల్లో స్టీలు, గాజు పలకలతో 57 అంతస్తుల అందాల భవంతిని కట్టేసింది 'ది బ్రాడ్ సస్టేనబుల్ బిల్డింగ్ కో' అనే సంస్థ. మధ్య చైనాల చాంగ్నా నగరంలో దీన్ని ఇటీవలే నిర్మించారు. -
బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 12 మంది మృతి
బీజింగ్: మధ్య చైనా హ్యూనన్ ప్రావెన్స్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు గల్లంతయారని చెప్పారు. కర్మాగారం సమీపంలో నడుచుకుంటు వెళ్తున్న మూగ్గురు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. మరో ముగ్గురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, స్వల్పగాయాలపాలైన వారు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంటికి వెళ్లారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పేలుళ్ల దాటికి కర్మాగారం సమీపంలోని భవనాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయని వెల్లడించారు. ఈ బాణాసంచా కర్మాగారం యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.