బీజింగ్: చైనాలో అంతరించి పోతున్న ఓ అరుదైన వృక్షాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ వృక్షానికి 1,300 ఏళ్ల చరిత్ర ఉంటుందన వారు తెలిపారు. అంతరించిపోతున్న పురాతన వృక్షాలను లెక్కిస్తున్న చర్యల్లో భాగంగా మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈ వృక్ష జాతని గుర్తించారు.
షన్వాంగ్షాన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్లో ది టాక్సస్ అనే చైనాలోని ఈ ప్రత్యేక వృక్షం కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ వృక్షం 35 మీటర్లు ఎత్తు ఉందని దాని కాండం 2.2 మీటర్ల వ్యాసార్థం ఉందని దీనికి ఇరు వైపులా రెండు ఉప వృక్షాలు ఉన్నట్లు తెలిపారు. ఈ మూడు వృక్షాలను స్థానికులు ఎంతో ప్రేమగా సంరక్షిస్తున్నారని వివరించారు.
ఆ చెట్టుకు 1,300 సంవత్సరాలు
Published Thu, Nov 5 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement