బీజింగ్: మధ్య చైనా హ్యూనన్ ప్రావెన్స్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు గల్లంతయారని చెప్పారు. కర్మాగారం సమీపంలో నడుచుకుంటు వెళ్తున్న మూగ్గురు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. మరో ముగ్గురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, స్వల్పగాయాలపాలైన వారు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంటికి వెళ్లారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పేలుళ్ల దాటికి కర్మాగారం సమీపంలోని భవనాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయని వెల్లడించారు. ఈ బాణాసంచా కర్మాగారం యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.