Hunan province
-
చైనాలో బంగారు పంట
బీజింగ్: చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్‌లో పింగ్‌జియాండ్ కౌంటీలోని వాంగూ గోల్డ్ ఫీల్డ్‌లో ఇటీవల తవ్వకాల్లో వీటిని గుర్తించారు. ఇక్కడ ఏకంగా 1,000 టన్నులకు (10 లక్షల కిలోలకు) పైగా పసిడి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకేచోట ఈ స్థాయిలో నిల్వలను గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. భూ ఉపరితలం నుంచి 2 కి.మీ. దిగువన 300 టన్నులు, 3 కి.మీ. దిగువన 700 టన్నులు ఉన్నట్లు చెబుతున్నారు. దీని విలువ 80 బిలియన్ డాలర్ల (రూ.6.76 లక్షల కోట్లు) పైమాటే! సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌ను ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారముంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు. అలాంటిది హునాన్‌లో టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని తేల్చారు. అంటే అత్యధిక నాణ్యత కలిగిన ముడి ఖనిజమని పేర్కొంటున్నారు. కళ్లు చెదిరే రీతిలో బంగారం నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ గోల్డ్ మార్కెట్‌ను డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10 శాతం. ఇకపై అది మరింత పెరుగబోతోంది. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందనుంది. -
టూరిస్ట్ బస్సులో మంటలు, 26మంది మృతి
బీజింగ్ : చైనాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 26మంది మృతి చెందగా, మరో 28మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... సెంట్రల్ చైనా..హ్యూనన్ ఫ్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 28మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు బస్సులో మొత్తం 53మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో పాటు టూరిస్ట్ గైడ్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 64కి చేరింది. మరో 640మంది గాయపడ్డారు. -
పట్టాలు లేని రైలు పాస్ అయింది!
రైలంటే... రెండు పట్టాలుండాలి... బోలెడన్ని బోగీలుండాలి.. అక్కడక్కడ మూడు రంగుల్లో సిగ్నళ్లు, క్రాసింగ్‌లు కనిపించాలి! కానీ ఈ ఫొటోలను కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా... పట్టాలు మాత్రం మాయమైపోయాయి! అలాగని దీన్ని ఓ పొడవైన బస్సు అంటే చైనీస్ రైల్ కార్పొరేషన్ వాళ్లు ఒప్పుకోరు! దీన్ని తయారు చేసింది వాళ్లే మరి. ఈ రైలు.. కంటికి కనిపించని వర్చువల్ పట్టాలపై పరుగులు పెడుతుందంటున్నారు వాళ్లు! విషయం ఏమిటంటే... పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త కొత్త రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాహనాలన్నీ అడుగు నుంచి దూసుకెళ్లేలా ఓ కొత్త బస్సును డిజైన్ చేసినా, వాయు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైయిన్లను అభివృద్ధి చేసినా లక్ష్యం మాత్రం ఇదే. ఈ దశలో జరిగిన తాజా ఆవిష్కరణ ఈ పట్టాల్లేని రైలు! చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ రైలును తొలిసారి ప్రయోగాత్మకంగా పరుగెత్తించారు. వంద అడుగు ల పొడవైన ఈ రైల్లో ఒకేసారికి 307 మంది ప్రయాణించవచ్చు. సిటీబస్సుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ వీటిని మెట్రో రైలు ఏర్పాటుకయ్యే ఖర్చులో ఐదోవం తుతోనే కొనుక్కోవచ్చు, నడపవచ్చు అని చైనీస్ రైల్ కార్పొరేషన్ చెబుతోంది. విద్యు త్తుతో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కాలుష్యం బాధ తక్కువ. పది నిమిషాలపాటు చార్జ్ చేస్తే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పాతిక కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ప్లాస్టిక్, రబ్బర్లతో కూడిన చక్రాలు... సెన్సర్ల సాయంతో నిర్దేశించిన మార్గంలో పట్టు తప్పకుండా ప్రయాణి స్తుందట. చైనీస్ రైల్ కార్పొరేషన్ ఈ పట్టాల్లేని రైలు కోసం ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది నుంచి ఇది ఝుఝూ నగరంలో పరుగులు పెట్టనుంది. ఇంకోమాట... ఒక్కో రైలు కనీసం పాతికేళ్లు మన్నికగా సేవలు అందిస్తుందని అంటున్నారు! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పట్టాలు లేని రైలు.. ఎలా వెళ్తుందో తెలుసా?
-
పట్టాలు లేని రైలు.. ఎలా వెళ్తుందో తెలుసా?
రైలంటే... రెండు పట్టాలుండాలి... బోలెడన్ని బోగీలుండాలి.. అక్కడక్కడ మూడు రంగుల్లో సిగ్నళ్లు, క్రాసింగ్‌లు కనిపించాలి! కానీ ఈ ఫొటోలను కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా... పట్టాలు మాత్రం మాయమైపోయాయి! అలాగని దీన్ని ఓ పొడవైన బస్సు అంటే చైనీస్ రైల్ కార్పొరేషన్ వాళ్లు ఒప్పుకోరు! దీన్ని తయారు చేసింది వాళ్లే మరి. ఈ రైలు.. కంటికి కనిపించని వర్చువల్ పట్టాలపై పరుగులు పెడుతుందని అంటున్నారు వాళ్లు! విషయం ఏమిటంటే... పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త కొత్త రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాహనాలన్నీ అడుగు నుంచి దూసుకెళ్లేలా ఓ కొత్త బస్సును డిజైన్ చేసినా, వాయు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైయిన్లను అభివృద్ధి చేసినా లక్ష్యం మాత్రం ఇదే. ఈ దిశలో జరిగిన తాజా ఆవిష్కరణ ఈ పట్టాల్లేని రైలు! చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ రైలును మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా పరిగెత్తించారు. దాదాపు వంద అడుగుల పొడవైన ఈ రైల్లో ఒక్కసారికి దాదాపు 307 మంది ప్రయాణించవచ్చు. సిటీబస్సుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ వీటిని మెట్రో రైలు ఏర్పాటుకయ్యే ఖర్చులో ఐదోవంతుతోనే కొనుక్కోవచ్చు, నడపవచ్చు అని చైనీస్ రైల్ కార్పొరేషన్ చెబుతోంది. విద్యుత్తుతో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కాలుష్యం బాధ తక్కువ. పది నిమిషాలపాటు ఛార్జ్ చేస్తే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పాతిక కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ప్లాస్టిక్, రబ్బర్లతో కూడిన చక్రాలు... బోలెడన్ని సెన్సర్ల సాయంతో ఇది ముందుగా నిర్దేశించిన మార్గంలో పట్టు తప్పకుండా ప్రయాణిస్తుందట. చైనీస్ రైల్ కార్పొరేషన్ ఈ పట్టాల్లేని రైలు కోసం ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది నుంచి ఇది ఝుఝూ నగరంలో పరుగులు పెట్టనుంది. ఇంకోమాట... ఒక్కో రైలు కనీసం పాతికేళ్లు మన్నికగా సేవలు అందిస్తుందని అంటున్నారు! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
35 మంది సజీవ దహనం
చైనా బస్సు ప్రమాదం బీజింగ్: చైనాలో 56 మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బస్సు ఆదివారం మంటల్లో చిక్కుకోగా 35 మంది ప్రయాణికులు ఆహుతి అయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. హునాన్ రాష్ట్రంలో రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు నుంచి లీకైన ఆయిల్ మంటలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం చైనాలో ఏడాదికి రెండున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. -
పేలిన ట్రక్కు : ఐదుగురు మృతి
బీజింగ్ : మధ్య చైనా హునాన్ ప్రావిన్స్‌లో జాతీయ రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. సదరు ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. అలాగే ఈ పేలుడు ధాటికి రెండు కార్లు, రెండు ట్రక్కులతోపాటు ఏడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయని చెప్పారు. ఈ ఘటనతో రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. -
ఆ బంగారు నాణేల గుట్టు విప్పగలరా?
చాంగ్షా: చైనాలోని హునాన్ ప్రావిన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో బయటపడిన ఆరు విదేశీ బంగారు నాణేలపై ఉన్న లిపిని తెలియజేస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రపంచంలోని ఎక్కడివారైనా ఆ నాణేలపై ఉన్న భాషను గుర్తించి వివరించవచ్చు. జినిషి నగరంలని ది కల్చరల్ రెలిక్స్ బ్యూరో 1960లో జరిపిన తవ్వకాల్లో ఓ గాజుకుండను గుర్తించింది. అందులో ఆరు నాణేలు ఉన్నాయి. అయితే, ఆ నాణేల వెనుక ఏదో తెలియని లిపిలో అక్షరాలు రాసి ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ఆ దేశంలోని పురాతన భాష లిపి నైపుణ్యవాదులు ఎంతో ప్రయత్నించారు. కానీ, వాటిపై ఏం రాసి ఉందన్న విషయం ఇప్పటి వరకు తమ దేశంలో ఎవరివల్లా కాలేదు. దీంతో 1980లో వాటిని అక్కడే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. ఎంతోమంది ఆ నాణేలపై ఉన్న ఆ లిపి ఏమిటి అని పరిశీలించేందుకు వచ్చి అర్ధం కాక తలలు పట్టుకొని వెళ్లారు. అసలు ఇంతకు ఎందుకు చైనీయులు ఆ నాణేలపై ఉన్న భాషను గుర్తించాలని అనుకుంటున్నారంటే.. అవి తమ దేశ తొలి దశ సంస్కృతికి చెందిన పునరావశేషాలు అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్‌తో పోల్చినప్పుడు గ్రీక్ పద్దతిని అనుసరిస్తూ ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో వీటిని తయారు చేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ది కల్చరల్ రెలిక్స్ బ్యూరో డైరెక్టర్ పెంగ్ జియా మాట్లాడుతూ'ఆ నాణేలపై అత్యంత అరుదుగా కనిపించే అరబిక్ పద్ధతిలో ఓ రాజు పేరు రాసి ఉందని అర్థమవుతుంది. కానీ అది ఏమిటనేది డీకోడ్ చేయడంలో విఫలమవుతున్నాం. ఇప్పటికే చైనా, ఇతర విదేశీ నిపుణులను కలిశాను. కానీ ఫలితం రాలేదు. ఈ నాణేలపై ఉన్న ఆ లిపిని గుర్తించిన వారికి పది వేల చైనా యువాన్లు(1500 డాలర్లు) ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.లక్షకు పైగా చెల్లిస్తాం' అని ఆయన చెప్పారు. -
బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 12 మంది మృతి
బీజింగ్: మధ్య చైనా హ్యూనన్ ప్రావెన్స్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు గల్లంతయారని చెప్పారు. కర్మాగారం సమీపంలో నడుచుకుంటు వెళ్తున్న మూగ్గురు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. మరో ముగ్గురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, స్వల్పగాయాలపాలైన వారు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంటికి వెళ్లారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పేలుళ్ల దాటికి కర్మాగారం సమీపంలోని భవనాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయని వెల్లడించారు. ఈ బాణాసంచా కర్మాగారం యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
లిక్కర్ వ్యాన్ ఢీ: 38 మంది మృతి
చైనా హ్యూనన్ ఫ్రావెన్స్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 38 మంది మరణించగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న వాహనాన్ని ఎదురుగా అల్కహాల్ లోడ్‌తో వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. దాంతో ప్రయాణికుల వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక శకటాలతో సహా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. దాదాపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి ఆ మంటలార్పారు. ఆ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
చెరువులో పడ్డ బస్సు : 11 మంది మృతి
మధ్య చైనా హునన్ ప్రావెన్స్ సియాంగ్టన్ నగర పర్వత ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కిండర్‌గార్డెన్ విద్యార్థులతో వెళ్తున్న మినీ స్కూల్ వ్యాన్ చెరువులో పడిపోయింది. ఆ ప్రమాదంలో 11 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది చిన్నారులేనని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు, డ్రైవర్ కూడా మృతి చెందారని చెప్పారు. ఆ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది తెలిపారు. చెరువు నుంచి మృతదేహాలతోపాటు బస్సు వెలికి తీసినట్లు చెప్పారు. మినీ బస్సులో కేవలం 7 చిన్నారులకు కుర్చోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. అలాంటిది 11 మందితో ప్రయాణిస్తున్న వాహనం అధిక లోడు కారణంగా అదుపు తప్పి నీటిలో పడిందని చెప్పారు.