చెరువులో పడ్డ బస్సు : 11 మంది మృతి | Overloaded China kindergarten bus crash kills 11 | Sakshi
Sakshi News home page

చెరువులో పడ్డ బస్సు : 11 మంది మృతి

Published Fri, Jul 11 2014 11:55 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Overloaded China kindergarten bus crash kills 11

మధ్య చైనా హునన్ ప్రావెన్స్ సియాంగ్టన్ నగర పర్వత ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కిండర్గార్డెన్ విద్యార్థులతో వెళ్తున్న మినీ స్కూల్ వ్యాన్ చెరువులో పడిపోయింది. ఆ ప్రమాదంలో 11 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది చిన్నారులేనని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు, డ్రైవర్ కూడా మృతి చెందారని చెప్పారు.

 

ఆ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది తెలిపారు. చెరువు నుంచి మృతదేహాలతోపాటు బస్సు వెలికి తీసినట్లు చెప్పారు. మినీ బస్సులో కేవలం 7 చిన్నారులకు కుర్చోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. అలాంటిది 11 మందితో ప్రయాణిస్తున్న వాహనం అధిక లోడు కారణంగా అదుపు తప్పి నీటిలో పడిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement