35 మంది సజీవ దహనం
చైనా బస్సు ప్రమాదం
బీజింగ్: చైనాలో 56 మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బస్సు ఆదివారం మంటల్లో చిక్కుకోగా 35 మంది ప్రయాణికులు ఆహుతి అయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. హునాన్ రాష్ట్రంలో రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు నుంచి లీకైన ఆయిల్ మంటలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం చైనాలో ఏడాదికి రెండున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు.