పట్టాలు లేని రైలు పాస్‌ అయింది! | China unveils track-less train that runs on virtual rails | Sakshi
Sakshi News home page

పట్టాలు లేని రైలు పాస్‌ అయింది!

Published Mon, Jun 5 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

పట్టాలు లేని రైలు పాస్‌ అయింది!

పట్టాలు లేని రైలు పాస్‌ అయింది!

రైలంటే... రెండు పట్టాలుండాలి... బోలెడన్ని బోగీలుండాలి.. అక్కడక్కడ మూడు రంగుల్లో సిగ్నళ్లు, క్రాసింగ్‌లు కనిపించాలి! కానీ ఈ ఫొటోలను కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా... పట్టాలు మాత్రం మాయమైపోయాయి! అలాగని దీన్ని ఓ పొడవైన బస్సు అంటే చైనీస్‌ రైల్‌ కార్పొరేషన్‌ వాళ్లు ఒప్పుకోరు! దీన్ని తయారు చేసింది వాళ్లే మరి. ఈ రైలు.. కంటికి కనిపించని వర్చువల్‌ పట్టాలపై పరుగులు పెడుతుందంటున్నారు వాళ్లు! విషయం ఏమిటంటే... పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త కొత్త రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మిగిలిన వాహనాలన్నీ అడుగు నుంచి దూసుకెళ్లేలా ఓ కొత్త బస్సును డిజైన్‌ చేసినా, వాయు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ ట్రైయిన్లను అభివృద్ధి చేసినా లక్ష్యం మాత్రం ఇదే. ఈ దశలో జరిగిన తాజా ఆవిష్కరణ ఈ పట్టాల్లేని రైలు! చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ రైలును తొలిసారి ప్రయోగాత్మకంగా పరుగెత్తించారు.  వంద అడుగు ల పొడవైన ఈ రైల్లో ఒకేసారికి 307 మంది ప్రయాణించవచ్చు. సిటీబస్సుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ వీటిని మెట్రో రైలు ఏర్పాటుకయ్యే ఖర్చులో ఐదోవం తుతోనే కొనుక్కోవచ్చు, నడపవచ్చు అని చైనీస్‌ రైల్‌ కార్పొరేషన్‌ చెబుతోంది.

విద్యు త్తుతో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కాలుష్యం బాధ తక్కువ. పది నిమిషాలపాటు చార్జ్‌ చేస్తే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పాతిక కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ప్లాస్టిక్, రబ్బర్లతో కూడిన చక్రాలు... సెన్సర్ల సాయంతో   నిర్దేశించిన మార్గంలో పట్టు తప్పకుండా ప్రయాణి స్తుందట. చైనీస్‌ రైల్‌ కార్పొరేషన్‌ ఈ పట్టాల్లేని రైలు కోసం ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది నుంచి ఇది ఝుఝూ నగరంలో పరుగులు పెట్టనుంది. ఇంకోమాట... ఒక్కో రైలు కనీసం పాతికేళ్లు మన్నికగా సేవలు అందిస్తుందని అంటున్నారు!
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement