టూరిస్ట్‌ బస్సులో మంటలు, 26మంది మృతి | China bus blaze kills at least 26, injures 28 | Sakshi
Sakshi News home page

చైనాలో ఘోర ప్రమాదం, 26మంది మృతి

Published Sat, Mar 23 2019 9:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:36 AM

China bus blaze kills at least 26, injures 28 - Sakshi

బీజింగ్‌ : చైనాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 26మంది మృతి చెందగా, మరో 28మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... సెంట్రల్‌ చైనా..హ్యూనన్‌ ఫ్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 28మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు బస్సులో మొత్తం 53మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో పాటు టూరిస్ట్‌ గైడ్‌ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 64కి చేరింది. మరో 640మంది గాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement