central investigating agency
-
CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!
కేంద్రం టార్గెట్‌గా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారా?. దర్యాప్తు సంస్థలతో ఢీ కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా?. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా?. మునుగోడు స్ట్రాటజీని వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా?. అసలు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగింది? అనేది ఓ పరిశీలిస్తే.. కేంద్రాన్ని ఢీ కొనేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటే వాటిని తిప్పికొట్టేందుకు తనకున్న అధికారాలను ప్రధాన అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతలే టార్గెట్‌గా రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతున్నారు. ఇదే అంశాన్ని ఎల్పీ సమావేశంలో నేతలకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని వారు ఎంత దూరం వెళ్తే మనం అంత దూరం వెళదామని నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రధాన టార్గెట్‌గా నేతలంతా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల్లో బీజేపీని దోషిగా నిలపాలని, ప్రతి అవకాశాన్ని వాడుకోవాలన్నారు. తన కూతురు కవితని పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటాయా? అని వాపోయారు. పార్టీలో ఇంకెవరికైనా పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. రానున్న 10 నెలలు కీలకమని అందరూ సీరియస్‌గా పనిచేయాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) మునుగోడు ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన చోట ఇంఛార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులకు క్లాస్ పీకినట్లు సమాచారం. నిత్యం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ పనిచేయాలని సూచించారు. రానున్న కాలమంతా ఎన్నికల సంవత్సరంగా భావించి పనిచేయాలన్నారు. మునుగోడు అమలు చేసిన స్ట్రాటజీని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ప్రతి 100 మందికి ఓ ఇన్ఛార్జ్ను నియమించి ప్రణాళికతో ముందుగా సాగాలని నేతలను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను ఆదేశించారు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టం చేకూరిస్తే అసలు స్థానమే కోల్పోతారని పలువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మూడోసారి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు, బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఢీకొనేందుకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. -
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
జీవితఖైదీలను విడుదల చేయొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: వివిధ జైళ్లలో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఇతర కేంద్ర సంస్థలు వాదించిన కేసుల్లో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్నవారిని విడుదల చేసేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా? లేదా? అన్నదానిపై జూలై 18 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22న జరిగేంతవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయంది. మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులకు శిక్ష తగ్గించాలన్న తమిళనాడు ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తోంది. -
సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ
అమృత్సర్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గత దశాబ్దకాలంలో విశ్వసనీయతా లోపంతో బాధపడిందని శుక్రవారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను దోషులుగా నిలబెట్టేందుకు అధికార పార్టీ సీబీఐ డెరైక్టర్లను నియంత్రిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ.. డెరైక్టర్ల ద్వారా నియంత్రణలో ఉండే సంస్థ. ఆ సంస్థ డెరైక్టర్లు స్వతంత్ర వ్యవస్థల ద్వారా కాకుండా ప్రభుత్వం ద్వారా నియమితులవుతున్నారు. అందువల్ల వారు ప్రభుత్వ నియంత్రణలో మాత్రమే కాకుండా అధికార పార్టీలోని కీలక వ్యక్తుల నియంత్రణలోనూ ఉంటున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లలో బీజేపీ నేతలపై దాఖలైన అసమంజస చార్జిషీట్లను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నిజాయితీతో ఉండాలని, సీబీఐ అధికారులు ఇతరుల కన్నా మరింత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు. -
900 ఈ-మెయిల్స్ హ్యాకింగ్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 900 ఈ-మెయిల్ ఖాతాలను హ్యాకింగ్ చేసిన పుణేకు చెందిన ఓ వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ విక్రమ్ తివారీ(30) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ ఆర్మీ అధికారి కుమారుడైన అమిత్.. కొందరు వ్యక్తుల నుంచి మొదలుకొని కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఈ-మెయిల్ ఖాతాలను సైతం హ్యాక్ చేశాడని సీబీఐ అధికారులు తెలిపారు. హ్యాక్ చేసిన ఈ-మెయిల్ ఖాతాల పాస్‌వర్డ్‌లను అమెరికాలోని సర్వర్ల ద్వారా పనిచేస్తున్న హైర్హ్యాకర్.నెట్, అనానిమైటీ.కామ్ అనే తన వెబ్సైట్ల ద్వారా అమిత్ క్లయింట్లకు విక్రయించాడు. ఒక్కో పాస్వర్డను రూ.30వేలకు అమ్మాడు.