న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 900 ఈ-మెయిల్ ఖాతాలను హ్యాకింగ్ చేసిన పుణేకు చెందిన ఓ వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ విక్రమ్ తివారీ(30) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ ఆర్మీ అధికారి కుమారుడైన అమిత్.. కొందరు వ్యక్తుల నుంచి మొదలుకొని కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఈ-మెయిల్ ఖాతాలను సైతం హ్యాక్ చేశాడని సీబీఐ అధికారులు తెలిపారు. హ్యాక్ చేసిన ఈ-మెయిల్ ఖాతాల పాస్‌వర్డ్‌లను అమెరికాలోని సర్వర్ల ద్వారా పనిచేస్తున్న హైర్‌హ్యాకర్.నెట్, అనానిమైటీ.కామ్ అనే తన వెబ్‌సైట్ల ద్వారా అమిత్ క్లయింట్లకు విక్రయించాడు. ఒక్కో పాస్‌వర్‌డను రూ.30వేలకు అమ్మాడు.