Central Lighting
-
జుక్కల్ నియోజకవర్గానికి రూ.32 కోట్ల నిధులు
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ ఐదు మండలాలకు రూ.32 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే హన్మంత్‌సింధే వెల్లడించారు. ఆయా మండలాల్లో నిధులను రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ.335 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అతి త్వరలో డిగ్రీ కళాశాల.. మద్నూర్ మండల విద్యార్థులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతి త్వరలో రాబోతుందని, దీంతో విద్యార్థుల కళ నెరవేరుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు ఆయన అన్నారు. ఆలస్యం లేకుండా మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు త్వరలో వస్తాయని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ మంజూరుతో బీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, ఆత్మకమిటీ చైర్మన్ గంగాధర్, ఉప సర్పంచ్ విఠల్, నాయకులు కంచిన్ హన్మండ్లు, పాకాల విజయ్, కుషాల్ తదితరులు ఉన్నారు. -
సెంట్రల్ లైటింగ్‌కు ప్రతిపాదనలు
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో డైట్ కాలేజీ నుంచి మిర్యాలగూడ రోడ్డులో కిలో మీటరు మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. జిల్లా కలెక్టరేట్ ఉన్న సమీపంలోనే రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తెలుత్తుతున్నాయి. ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్‌కు వెళ్లే వారితో పాటు, రాంనగర్లో ఉన్న వైఎస్సార్ పార్కుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ రోడ్డులో పలు కాలనీలు ఏర్పాటు కావడంతో రాత్రి సమయంలో రాకపోకలు ఎక్కువయ్యాయి. అదే విధంగా పట్టణంలో రద్దీ, వాహనాల సంఖ్య ఇటీవల భారీగా పెరగడంతో యువత స్పీడుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ డివైడర్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్లు వచ్చాయి. రూ. 44.50 లక్షలతో ఏర్పాటు ... పట్టణంలోని భాస్కర్ టాకీస్ నుంచి డైట్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌ను ఐదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. డైట్ నుంచి కేశరాజుపల్లి వరకు రోడ్డు వెడల్పు జరిగినా అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో పలు సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డివైడర్లు లేక ద్విచక్ర వాహనదారులు ఓవర్‌టెక్ చేసే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. డైట్ నుంచి ఒక కిలో మీటరు మేర డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 44.50 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారు. మార్చిలోగా పనుల పూర్తి డైట్ నుంచి బృందావన కాలనీ వరకు ఏర్పాటు చేయబోయే లైటింగ్, డివైడర్ల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సన్నమద్ధమవుతుంది. ఇక్కడ పనులు పూర్తియితే ప్రమాదాలు 90 శాతం తప్పనున్నాయి. కలెక్టరేట్ వద్ద కూడా లైటింగ్ వెలుగులు వెలగనున్నాయి. -
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
కావలి : పట్టణంలోని ఉదయగిరి రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పి.నారాయణ గురువారం రాత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 6వ వార్డులో సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బాలికల హాస్టల్ భవనాల ప్రారంభం ఆలస్యంగా జరిగింది. రెడ్‌క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, జిల్లా జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ పట్టణంగా అనకాపల్లి
రూ.65 కోట్లతో శాశ్వత మంచినీటి ప్రణాళిక ఏలేరు కాలువ నుంచి నీటి మళ్లింపు ఆధునిక బస్షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్ జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ అనకాపల్లిరూరల్: అనకాపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ వాసుల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.65 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అలాగే రూ.70 లక్షలతో పాతపైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తామని చెప్పారు. పూడిమడక రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.18.5 లక్షలతో నూకాంబిక గుడి, వేల్పులవీధి, చిరంజీవి బస్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే రూ.3.5 లక్షలతో ఆధునిక బస్షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. మున్సిపల్ మైదానం వద్ద ఇద్దరు నైట్వాచ్మన్లను, లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీటి వృథా అరికట్టేందుకు రూ.2.65 లక్షలతో కుళాయిలకు హెడ్స్ బిగిస్తామని చెప్పారు. కొత్తగా 20 చోట్ల బోరుబావులు తవ్విస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 400 బీపీఎల్ కుళాయి కనెక్షన్లు తక్షణం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని చెప్పారు. శారదనగర్‌లో ప్రస్తుతం ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.వి.జగన్నాథరావు పాల్గొన్నారు.