నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో డైట్ కాలేజీ నుంచి మిర్యాలగూడ రోడ్డులో కిలో మీటరు మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. జిల్లా కలెక్టరేట్ ఉన్న సమీపంలోనే రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తెలుత్తుతున్నాయి. ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్‌కు వెళ్లే వారితో పాటు, రాంనగర్‌లో ఉన్న వైఎస్సార్ పార్కుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ రోడ్డులో పలు కాలనీలు ఏర్పాటు కావడంతో రాత్రి సమయంలో రాకపోకలు ఎక్కువయ్యాయి. అదే విధంగా పట్టణంలో రద్దీ, వాహనాల సంఖ్య ఇటీవల భారీగా పెరగడంతో యువత స్పీడుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ డివైడర్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్లు వచ్చాయి.
రూ. 44.50 లక్షలతో ఏర్పాటు ...
పట్టణంలోని భాస్కర్ టాకీస్ నుంచి డైట్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌ను ఐదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. డైట్ నుంచి కేశరాజుపల్లి వరకు రోడ్డు వెడల్పు జరిగినా అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో పలు సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డివైడర్లు లేక ద్విచక్ర వాహనదారులు ఓవర్‌టెక్ చేసే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. డైట్ నుంచి ఒక కిలో మీటరు మేర డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 44.50 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారు.
మార్చిలోగా పనుల పూర్తి
డైట్ నుంచి బృందావన కాలనీ వరకు ఏర్పాటు చేయబోయే లైటింగ్, డివైడర్ల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సన్నమద్ధమవుతుంది. ఇక్కడ పనులు పూర్తియితే ప్రమాదాలు 90 శాతం తప్పనున్నాయి. కలెక్టరేట్ వద్ద కూడా లైటింగ్ వెలుగులు వెలగనున్నాయి.
సెంట్రల్ లైటింగ్‌కు ప్రతిపాదనలు
Published Tue, Dec 27 2016 1:38 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement