నల్లగొండ టౌన్: మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బంద్ నల్లగొండ పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. బ్యాంకులు, పెట్రోల్ బంక్‌లు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లను మూసి ఉంచారు. దుకాణాలు మధ్యాహ్నం తరువాత తెరుచుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల తరువాత ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. తెల్లవారుజామునే బస్సు డిపోకు చేరుకున్న వామపక్ష పార్టీలు, టీడీపీ నాయకులు బస్సులు బయటకు రాకుండా గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచుతామని, విధులకు హాజరుకాని కార్మికులను తొలగించాలని ఆదేశాలను జారీ చేయడం శోచనీయమన్నారు.
అనంతరం పోలీసులు వామపక్షపార్టీల నాయకులను అరెస్టు చేసి రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, కొండేటి మల్లయ్య, దుబ్బ అశోక్‌సుందర్, పెరిక వెంకటేశ్వర్లు, వెంకటయ్య తదితరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్టు అయిన నాయకులకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తుమ్మల వీరారెడ్డి, కోమటిరెడ్డి అనంతరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, సయ్యద్ హాషం, నారి ఐలయ్య, మల్లు లక్ష్మి, పాలడుగు ప్రభావతి, కలకొండ కాంతయ్య, పాలడుగు నాగార్జున, కంచర్ల భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, ఎన్.బీమార్జున్‌రెడ్డి, అవుట రవీందర్, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారులు, విద్యాసంస్థలు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
వామపక్షాల బంద్ ప్రశాంతం
Published Sat, Jul 18 2015 12:57 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement