కేంద్రమంత్రిని కలిసిన మాగంటి, కావూరి
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏలూరు ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను వారు ఈ సందర్భంగా కోరారు.