కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి
కాకినాడ: సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. వైఎస్ఆర్ సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఏపీఎన్జీఓ సంఘం నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర అంతటా గత 8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు.