మంత్రి పదవి వద్దు: టీజీ వెంకటేష్
తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే తీసుకోబోనని, ఎంపీగానే కొనసాగుతానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ఆదివారం కర్నూలులోని బుధవారపేటో గౌరిగోపాల్ హాస్పిటల్లో వైద్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడారు. తాను పేరుకు ఎంపీ అయినా మంత్రి స్థాయిలో గౌరవం దక్కుతోందన్నారు. మంత్రి పదవి ఇస్తే ఆఫీస్లో కూర్చుని పనిచేస్తున్న భావన వస్తుందన్నారు. కొన్నాళ్ల పాటు ఎంపీగా ఉండి, ఇళ్లు, వ్యాపారం చక్కదిద్దుకోవాల్సి ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాతోపాటు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.