2020 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
తిరుపతి : దేశంలోని సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ 2020 నాటికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ది కేంద్రం లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ.15 కోట్ల తో నిర్మించిన హాలిడే హోంను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలో పేదలందరికీ అన్ని మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందన్నారు. ప్రస్తుతం 31 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని, 2020 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన 23 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు.