Central Water Department of Resources
-
భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: భూగర్భ జలాలను పెంపొందించడం, పొదుపుగా వినియోగించడం, వాటిని సంరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,089 మండలాలు, బ్లాక్‌లు, వ్యాలీలు, ఫిర్కాల పరిధిలో భూగర్భ జలమట్టంపై కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేస్తున్న మండలాలు, బ్లాక్‌లు 1,006 ఉంటే.. అందులో కేవలం 6 మాత్రమే ఏపీలో ఉన్నాయి. పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తున్న ప్రాంతం దేశంలో సగటున 14.19 శాతం ఉంటే.. ఇందులో రాష్ట్రంలో 0.98 శాతం ప్రాంతం మాత్రమే ఉంది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరిన రాష్ట్రాల్లో పంజాబ్(76.47 శాతం వినియోగం) మొదటి స్థానంలో ఉండగా.. రాజస్తాన్(72.52 శాతం) రెండో స్థానంలో, హరియాణా(61.54 శాతం) మూడో స్థానంలో, ఢిల్లీ(44.12 శాతం) నాలుగో స్థానంలో, తమిళనాడు(30.87 శాతం) ఐదో స్థానంలో నిలిచాయి. దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్‌లో భూగర్భ జలాలను వంద శాతం తోడేయడం వల్ల వాటి పరిస్థితి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. దేశంలో భూగర్భ జలాల పరిస్థితిపై కేంద్ర భూగర్భ జలవనరుల మండలితో కలిసి 2020లో ఒకసారి.. 2022లో మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన ప్రధానాంశాలు.. రాష్ట్రంలో 28 శాతమే వినియోగం.. ♦ దేశంలో గతేడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భంలోకి 15,451.65 టీఎంసీల నీళ్లు ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 14,056.20 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అందులో 8,444.73 టీఎంసీలను(60 శాతం) ఇప్పటికే ఉపయోగించారు. ♦ ఏపీలోని 667 మండలాల పరిధిలో గతేడాది కురిసిన వర్షాల వల్ల 961.13 టీఎంసీలు భూగర్భ జలాలుగా మారాయి. ఇందులో 913.11 టీఎంసీలను ఉపయోగించుకోవచ్చు. కానీ.. 263.05 టీఎంసీలు(28 శాతం) మాత్రమే వినియోగించారు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు, శ్రీసత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, హిందూపురం , రొళ్ల, తనకల్లులో మాత్రమే పరిమితికి మించి భూగర్భ జలాలను ఉపయోగించారు. ♦ రాష్ట్రంలో 667 మండలాల పరిధిలోని భౌగోళిక విస్తీర్ణం 1,40,719.5 చదరపు కిలోమీటర్లు కాగా, ఇందులో 1,380.65 చదరపు కిలోమీటర్ల భూ భాగంలో మాత్రమే భూగర్భ జలాలను పరిమితికి మించి వాడారు. సమృద్ధిగా వర్షాలు.. పెరిగిన భూగర్భ జలాలు.. రాష్ట్రంలో 2019 నుంచి ఏటా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటిని ఒడిసిపట్టి.. ప్రాజెక్టులు, చెరువులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అత్యధిక ఆయకట్టుకు ఏటా నీళ్లందిస్తోంది. భూగర్భ జలాల సంరక్షణ కట్టడాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 2020లో 850.91 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారగా.. 2022లో 961.13 టీఎంసీలు రూపాంతరం చెందాయి. 2020లో ఉపయోగించుకోదగ్గ భూగర్భజలాలు 810.36 టీఎంసీలుగా ఉండగా.. 2022 నాటికి 913.11 టీఎంసీలకు పెరిగింది. గతేడాది భూగర్భ జలాలను 269.41 టీఎంసీలు వాడుకోగా.. 2022లో 263.05 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సురక్షిత స్థాయిలో ఉన్న మండలాలు 2020లో 551 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 598కి పెరిగింది. పరిమితికి మించి తోడేసిన మండలాలు 2020లో 23 ఉండగా.. 2022లో వాటి సంఖ్య 6కు తగ్గింది. -
‘నిబంధనల ఉల్లంఘన జరగలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం పనులు, ఎం బుక్‌పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిశీలన జరుగుతోందని, ఏవైనా అక్రమాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశాఖ వెల్లడించింది. నూతన ప్రభుత్వంలో పోలవరం కాంట్రాక్ట్ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని అన్నారు. కాంపిటెంట్ అథారిటీ ఆమోదం తెలిపిన తర్వాతే కాంట్రాక్ట్ కేటాయింపు జరిగిందని కేంద్ర జల శక్తి శాఖ ప్రధాన కార్యాలయానికి తెలిపింది. టీడీపీ హయాంలో పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయానికి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సవివర నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి కేంద్ర జల శక్తిశాఖ పంపింది. పునరావాస పనులను పరిశీలించేందుకు రెండు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పునరావాసంలో అక్రమాలకు పాల్పడిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో, పోలవరం తహసిల్దార్‌పై ఏసీబీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నవంబర్ 13, 2019 లో పోలవరం కాంట్రాక్టు కేటాయింపులలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని, అధీకృత సంస్థ ఆమోదం తర్వాత నిర్ణయాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
-
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
కేంద్ర జల వనరుల శాఖ ముందు రాష్ట్రం వాదనలు ♦ సాగర్ దిగువన-ప్రకాశం ఎగువన నీటి లభ్యత పుష్కలం ♦ 181 టీఎంసీల కేటాయింపుల్లో 101 టీఎంసీలు అక్కడే లభ్యం ♦ మరో 20 టీఎంసీలు భీమాకు తరలిస్తే డెల్టాకు 60 టీఎంసీలు చాలు ♦ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15 మేరకు రాష్ట్రాలకు ఉన్నవి ♦ గుండుగుత్త కేటాయింపులే ♦ వాటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని వివరణ.. ♦ ఈ వాదనపై ఏకీభవించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టాకు ఉన్న నీటివాటాలో సగానికి పైగా నీరు.. నాగార్జునసాగర్ దిగువన, ప్రకాశం ఎగువలోనే లభ్యమవుతోందని కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ స్పష్టం చేసింది. సాగర్-ప్రకాశం మధ్య పరీవాహకంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నందున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటికేటాయింపులను 60 టీఎంసీలకు తగ్గించాలని సూచించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరులశాఖ వద్ద జరుగుతున్న కృష్ణా బోర్డు సమావేశాల్లో రాష్ట్రం తన వాదనలను బలంగా వినిపించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం, దాని ఉపనదుల్లో లభ్యమయ్యే నీరు, అందులో తెలంగాణకు దక్కాల్సిన వాటాను వివరిస్తూ నీటి లెక్కలను సమర్పించింది. సాగర్ దిగువనే..: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు ఇచ్చే 181.2 టీఎంసీల నీటిలో 101.2 టీఎంసీలు సాగర్ దిగువనే లభిస్తోందని తెలిపింది. కాబట్టి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటినే అవసరంగా భావించాలని పేర్కొంది. ఇందులో 20 టీఎంసీలను భీమాకు పునః కేటాయింపుగా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో డెల్టాకు 60 టీఎంసీలు సరిపోతుందని వివరించింది. తుంగభద్ర, వేదవతి సబ్బేసిన్ల ద్వారా కృష్ణాకు ఆశించిన నీరు రావడం లేదని.. లోయర్ కృష్ణా, మూసీ, పాలేరు, మున్నేరు సబ్బేసిన్ల నుంచి సాగర్‌కు నీరు రావడం లేదని స్పష్టం చేసింది. వీటి దృష్ట్యా సాగర్ నుంచి డెల్టాకు 60 టీఎంసీలను సరిపెట్టాలని వాదించింది. సబ్బేసిన్లు, కృష్ణా ప్రధాన పరీవాహకంలో 200 టీఎంసీలు(41.6 శాతం) తెలంగాణకు, 280.6 టీఎంసీలు (58.4 శాతం) ఏపీకి దక్కుతాయని తెలిపింది. గుండుగుత్త కేటాయింపులే!: ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలు గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా ఇచ్చినవేనని.. విభజన అనంతర ం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్‌బ్లాక్‌గానే చూడాలని రాష్ట్రం స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్‌లోని క్లాజ్-15 ప్రకారం ఒక రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 1996లోనూ అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్.. రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని పునః కేటాయించుకోవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. తమకు కేటాయించిన వాటా నీటినే సాగర్ నుంచి వాడుకుంటున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ వాదనతో కేంద్ర జలవనరుల శాఖ సైతం ఏకీభవించింది. కాగా ప్రాజెక్టుల భద్రతకు అన్ని రకాల రెగ్యులేటర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సీఐఎస్ఎఫ్తో పహారా అవసరం లేదని, ఎక్కడైనా సీఐఎస్ఎఫ్ బలగాలతో పెట్రోలింగ్ చేయించాలని సూచించింది.