రైల్వే రెగ్యులేటరీపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ట్రాయ్, విద్యుత్ రంగంలో ఈఆర్సీ ఉన్నట్లే రైల్వేల్లోనూ ప్రత్యేక నియంత్రణ సంస్థ(రెగ్యులేటరీ)ను నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నియంత్రణ సంస్థ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని ‘నీతి ఆయోగ్’ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కోరారు.
రైల్వేల్లో స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అవసరముందన్నారు. రైల్వేల్లో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరముందని, ఈ దిశగా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు మోడల్ సిద్ధం కాగానే దానిపై చర్చిస్తామన్నారు.