కొత్త గూడెం ఆర్మీ ర్యాలీకి భారీ స్పందన
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం యువసంద్రంగా మారింది. తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ బుధవారం ప్రారంభమైంది. 9 రోజులపాటు సాగే ఈ ర్యాలీ ని పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ జలగం వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న యువతకు ఇదొక మంచి అవకా శమన్నారు. తొలిరోజు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ విభాగాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.
మొదటి రోజున సుమారు 4 వేల మంది కి పైగా యువకులు రాగా. వారిలో ఎత్తు, ఛా తీ, సర్టిఫికెట్ల పరిశీలనలో 3,368 మంది అర్హత సాధించారు. వీరిలో సోల్జర్ టెక్నికల్ విభాగం లో 2,684 మంది, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో 678 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎత్తు కొలిచి వివిధ బ్లాక్ల్లోకి పంపించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారికి గురువారం శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్మీ ర్యాలీకి హాజరైన అభ్యర్థులకు జలగం వెం కటరావు ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.