ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు 1,331 మంది హాజరు
హైదరాబాద్: ఎడ్‌సెట్ మలివిడత వెబ్‌కౌన్సెలింగ్ శని, ఆదివారాల్లో జరిగింది. ఈ రెండురోజుల్లో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం, జీవశాస్త్రం మెథడాలజీలకు సంబంధించి ఒకటినుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగిన ఈ పరిశీలనకు 1,331 మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించిన విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు స్క్రాచ్‌కార్డులు, అకనాలెడ్జిమెంటు లెటర్లు అందించారు. ఆదివారం ఆయన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఎడ్‌సెట్ ఆఫీసును సందర్శించి ఈ లెటర్లు ఇచ్చారు. ఎడ్‌సెట్‌ను ప్రశాంతంగా, ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేస్తున్నందుకు కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మవెంకటరావు, ఇతర అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.