విధుల్లో చేరేందుకు వచ్చిన ఎంపీడీఓకు షాక్
చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు ఎంపీడీఓగా విధుల్లో చేరేందుకు వచ్చిన సీహెచ్ కృష్ణకు స్థానిక ఒక వర్గం నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన విధుల్లో చేరాల్సిన ఎంపీడీఓ గదికి కావాలనే తాళం వేసి ఉండటంతో చేసేది లేక సూపరింటెండెంట్ గదిలోనే బాధ్యతలు స్వీకరించారు. మద్దిపాడు ఎంపీడీఓగా పనిచేస్తున్న సీహెచ్ కృష్ణ మద్దిపాడు మండలంలో రెగ్యులర్ ఎంపీడీఓగా పనిచేస్తూనే సంతనూతలపాడు మండలానికి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జెడ్పీ సీఈఓ నియమించారు. అప్పటి వరకు ఇన్చార్జి ఎంపీడీఓగా పనిచేస్తున్న తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ తాను విధులు నిర్వర్తించలేనంటూ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో మద్దిపాడు నుంచి నియమించారు.
ఎంపీడీఓ విధుల్లో చేరేందుకు వచ్చే సమయానికి ఒక్క సీనియర్ అసిస్టెంట్ తప్ప మిగిలిన స్టాఫ్ ఎవరూ లేకుండా ముందుగానే వెళ్లిపోయారు. అంతే కాకుండా కొత్తగా ఎంపీడీఓ వస్తున్నట్లు ఎంపీపీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మండలంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో ఎంపీడీఓలు తరుచూ బదిలీలపై వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల్లో ఇప్పటి వరకు నలుగురు ఎంపీడీఓలు మారటమే ఆధిపత్యపోరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ ఇన్చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు బాలచెన్నయ్య నిర్వహించారు. ఆయనకు ముందు మాలకొండయ్య స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్లలో అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లి మరీ సస్పెండ్ చేయించారు. ఇలా వరుసగా నలుగురు ఎంపీడీఓలు మారడంతో స్థానిక నాయకులు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు.
పింఛన్ల సమస్య పరిష్కారం
కొత్తగా విధు ్చyజ్చి చేరిన ఎంపీడీఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 543 పింఛన్లను త్వరలో పరిష్కరించి పంపిణీ చేస్తానని చెప్పారు. మద్దులూరు గ్రామానికి చెందిన ఒక సీనియర్ మేట్‌ను విధుల్లో చేర్చుకున్నారు. వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎంపీడీఓ తెలిపారు.