chadalawada
-
చదలవాడ 'ధీర' గ్లింప్స్ విడుదల
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ చదలవాడ ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్ మాస్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ‘ధీర’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన అరియాన) ఇప్పటికే ధీర నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. నేడు లక్ష్ చదలవాడు పుట్టిన రోజు సందర్భంగా ధీర నుంచి అప్డేట్ ఇచ్చారు. ధీర మూవీ నుంచి గ్లింప్స్‌ను దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ చదలవాడ హీరోయిజం ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో డైలాగ్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. 'ఇరవై మంది వెళ్లారు కదరా?.. అవతల వాడు ఒక్కడే.. వార్ ని కూడా వార్మ్ అప్లా చేసేశాడు..' అనే డైలాగ్స్‌తో డైరెక్టర్ విక్రాంత్ లక్ష్ హీరోయిజాన్ని అమాంతం ఎలివేట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ లుక్స్, మ్యానరిజం అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రాబోతోంది. -
Ongole Cattle: పౌరుషాల గిత్తకు ఊపిరి!
నడకలో రాజసం.. పోటీల్లో పౌరుషం.. రూపంలో భారీ కాయం.. ఇదే ఒంగోలు గిత్త తేజసం. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. మూడేళ్ల ముందు వరకు నిర్వీర్యమైన ఈ క్షేత్రం క్రమేపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మేలైన పశువుల ఉత్పత్తిని పెంచి, సంరక్షించే దిశగా అడుగులేస్తోంది. ఇందు కోసం సెమన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. నేరుగా పిండాలను (యాంబ్రియో) ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. పశు ఉత్పత్తి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. నాగులుప్పలపాడు: చదలవాడలో 198 ఎకరాల్లో మూడు దశాబ్దాల క్రితం ఒంగోలు జాతి పశుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీమకుర్తికి గ్రానైట్ పరిశ్రమ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి క్షేత్రం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి పేరుకు క్షేత్రం నడిచినా.., పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సహకారం లభించడం, అధికారులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఆ ఫలాలు కనిపిస్తున్నాయి. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు: క్షేత్రంలో గడచిన రెండు మూడేళ్లలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పశువుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రూ.2 కోట్లతో 4 నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలన అవసరాల కోసం రూ.70 లక్షలతో నూతన పరిపాలన భవనం నిర్మించారు. వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు క్షేత్రం మొత్తం రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా గోచార్ పథకంలో క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు కేటాయించారని, వీటిని త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన పశువుల ఉత్పత్తి: క్షేత్రంలో 292 పశువులుండగా, వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టి ఆవులు 24, మిగిలినవి మూడేళ్లలోపు లేగదూడలున్నాయి. గతంలో ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో జాతి ఆవులే అయినా..నాణ్యత తక్కువగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న లేగదూడలు ఒకింత ఆరోగ్యంగా పెరుగుతుండడంతో క్రమేపీ ఆవుల్లో నాణ్యత పెరుగుతోంది. నాణ్యత తక్కువ ఉన్న పశువులు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో మరింత నాణ్యమైన పశువులను క్షేత్రంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల నుంచి వచ్చే కోడెదూడలను ఆరు నెలల వరకు పెంచి రైతుల కోసం వేలం వేసి ఇస్తారు. గ్రాసం కొరతను అధిగమించి... మూడేళ్ల క్రితం క్షేత్రానికి గ్రాసం కొరత తీవ్రంగా ఉండేది. దాదాపు 200 ఎకరాల నాణ్యమైన భూమి ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోలేకపోయేవారు. ప్రస్తుతం ఆ కొరతను క్షేత్రం అధిగమించింది. బహువార్షిక గ్రాసాలు ఏడాది పొడవునా క్షేత్రంలో సాగు చేస్తున్నారు. దీనికి తోడు మాగుడు గడ్డి నిల్వకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి ముందుగానే నిల్వ ఉంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1600 టన్నుల సైలేజ్ గడ్డిని అందించింది. దీంతో క్షేత్రం గ్రాసం కొరతను అధిగమించింది. సమకూరిన వసతులు: నిన్నమొన్నటి వరకు మౌలిక వసతులు లేక కునారిల్లిన క్షేత్రంలో ఇప్పుడు భవనాల సమస్య తీరింది. పాలన భవనం కొత్త హంగులతో ఆహ్లాదంగా సిద్ధమైంది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా గతంలో ఉన్న డ్రైవర్ క్వార్టర్లను అభివృద్ధి చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచారు. క్షేత్రంలో అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మేలైన ఆవుల నుంచి అండాల సేకరణ కోసం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మిషన్‌ను కూడా తీసుకొచ్చారు. సేకరించిన అండాలను నిల్వ చేసేందుకు ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. పశువుల బరువును కూడా ప్రతి వారం తీసుకొని రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లాం ఫాం నుంచి తీసుకొచ్చిన సెమన్‌ను రైతుల కోసం అందుబాటులో ఉంచగా, భవిష్యత్‌లో నేరుగా పిండాలను (యాబ్రియో) కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవుపాలు పాలు, గోమూత్రంను నామమాత్రపు రుసుంతో రైతుల అవసరాల కోసం అందిస్తున్నారు. ఇంకా మిగిలిన సమస్యలివే... ఆవుల నాణ్యతను పెంచినప్పటికీ, కనీసం ఒక జత ఒంగోలు గిత్తలను ప్రదర్శన కోసమైన పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఎద్దు ఒక్కటి కూడా లేదు. భవిష్యత్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. క్షేత్రంలో భూగర్భ జలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు క్షేత్రంలోనే రెండు చెరువుల ద్వారా పశువులకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఆవులు బయటకు వెళ్లకపోతే ఫ్లోరైడ్ నీటితోనే వాటి దాహం తీర్చాల్సి వస్తోంది. దీంతో పశువుల నాణ్యతపై ప్రభావం పడుతోంది. త్వరలో ఉన్నతమైన ఫాంను చూస్తాం ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే పశుక్షేత్రంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు సిబ్బంది పనితీరుతో పశువుల నాణ్యత కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పశువుల నాణ్యత పరిశీలన కోసం ఇప్పటికే ప్రతి పశువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధిత రికార్డులు తయారు చేస్తున్నాం. ఇలాగే త్వరలో మన ఖ్యాతిని పెంచే ఒంగోలు జాతి సంపదతో కూడిన అత్యున్నతమైన ఫాంను తయారు చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, పశుక్షేత్రం -
గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, గుంటూరు : మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాం బాబు (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే 1985, 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా జయరాం బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా జయరాం బాబు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. చదలవాడకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
చదలాడ.. వ్యధవాడ
చాక్లెట్ కొనుక్కుంటానని చెంగుచెంగున గెంతుతూ వీధిలోకి వెళ్లిన చిన్నారి.. శవమై కాలువలో కనిపించడం అయినవారినే కాదు.. ఆ ఊరినే కలచివేసింది. అందరి కనులనూ చెమ్మగిల్లజేసింది. బరువెక్కిన వారి హృదయూలను ‘ఈ విషాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?’ అన్న ప్రశ్నలు పీడిస్తున్నాయి. పెద్దాపురం మండలంలోని చదలాడలో బుధవారం అదృశ్యమైన దొడ్డిపట్ల పూజిత (7) శుక్రవారం ఏలేరు కాలువలో మృతదేహమై కనిపించడంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. * ఆ గ్రామంలో బుధవారం అదృశ్యమైన ఏడేళ్ల పూజిత * రెండురోజుల తర్వాత ఏలేరు కాలువలో కనిపించిన మృతదేహం * పాప మృతిపై వ్యక్తమవుతున్న పలు అనుమానాలు పెద్దాపురం (సామర్లకోట) : కిర్లంపూడి మండలం వీరవరానికి చెందిన దొడ్డిపట్ల నారాయణరావు ఆ మండల తహశీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి బావమరిది సతీష్ వివాహం జరగనుండడంతో భార్య విజయకుమారిని, కుమార్తె పూజితను ఆరోజు ఉదయం చదలాడలోని మామ వరుపుల రూపులయ్య ఇంటి వద్ద దింపి వెళ్లారు. ఇంట్లో పెద్దలు పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆడుకుంటున్న పూజిత చాక్లెట్ కొనుక్కుంటానని తాతకు చెప్పి బయటకు వెళ్లింది. అరుుతే ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పరిసరాల్లో గాలించినా పాప జాడ కానరాలేదు. దాంతో తాత రూపులయ్య పెద్దాపురం పోలీసు స్టేషన్లో, తండ్రి నారాయణరావు కిర్లంపూడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బుధవారం రాత్రి జరగాల్సిన వివాహాన్ని పాప అదృశ్యం కారణంగా వాయిదా వేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పూజితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారనే అనుమానాలు వ్యక్తం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు బాలిక కోసం విస్తృతంగా గాలించారు. ఎలా జరిగిందో ఈ ఘోరం.. కాగా శుక్రవారం తాటిపర్తి సమీపంలోని ఏలేరు కాలువఒడ్డున బాలిక మృతదేహాన్ని చూసిన ఆ గ్రామస్తులు రూపులయ్య బంధువులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహం పూజితదే కావడంతో హతాశులయ్యూరు. పాప ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో పడిపోయి రెండు కిలోమీటర్ల దూరంలోని తాటిపర్తి వద్దకు కొట్టుకు వచ్చిందా లేక ఎవరైనా చంపి వేసి కాలువలో పారేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు, తాత తమకు ఎవరూ శత్రువులు లేరని చెపుతున్నారు. ఆ ఇంట జరగాల్సిన వివాహాన్ని నిలిపివేయడానికే ఎవరో పూజితను కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానమూ రేకెత్తింది. అయితే ఇరువైపులా అంగీకారంతోనే వివాహం నిశ్చయమైందని బంధువులు అంటున్నారు. జగ్గంపేట సీఐ జీవీవీ సత్యనారాయణ, పెద్దాపురం ఎస్సై వై.సతీష్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహానికి పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అటు పూజిత విషాదాంతంతో అటు వీరవరంలోనూ దుఃఖపూరిత వాతావరణం అలముకుంది. -
విషాదాంతమైన పూజిత అదృశ్యం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన పూజిత ఉదంతం విషాదంగా ముగిసింది. ఏలేరు కాలువ వద్ద పూజిత మృతదేహం లభ్యం కావడంతో ఆ కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం మేనమమా వివాహానికి ..పూజిత కుటుంబం చదలాడ వచ్చింది. బుధవారం ఉదయం చాక్లెట్ కొనుక్కునేందుకు బయటకు వచ్చిన చిన్నారి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు పూజితను ఇద్దరు మహిళలు ...ఆటోలో తీసుకు వెళ్లినట్లు సమచారం. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశంలో లారీ బీభత్సం: ఆరుగురు మృతి
-
ప్రకాశంలో లారీ బీభత్సం: ఆరుగురు మృతి
ఓ లారీ డ్రైవర్ పీకల వరకు మద్యం సేవించి వాహనం నడిపి ఆరుగురు మృతికి కారణమైన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. నాగులప్పులపాడు మండలం చదలవాడ, మద్దిరాలపాడు వద్ద అతడు నడుపుతున్న వాహనం ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌లను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.