
సాక్షి, గుంటూరు : మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాం బాబు (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే 1985, 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా జయరాం బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా జయరాం బాబు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. చదలవాడకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.