chain snatched
-
బంగారు గొలుసు అపహరణ
పార్వతీపురం : మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన సంఘటన కొమరాడ మండలం గుణానపురంలో సోమవారం జరిగింది. పార్వతీపు రం ఔట్‌పోస్టు పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... గుణానపురం గ్రామానికి చెందిన మిరియాల రాముడమ్మ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించి, రాముడమ్మ నోట్లో గుడ్డలు కుక్కి బండరాయితో తలపై మోదాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగ దోచుకుపోయాడు. తలుపులకు గడియ పెట్టి వెళ్లిపోవడంతో ఎవరికీ విషయం తెలియలేదు. కొన్ని గంటల తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు తెరవగా అపస్మారక స్థితిలో ఉన్న రాముడమ్మను గమనించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు వైద్యసేవలందిస్తున్నారు. -
ఎస్ఐ భార్య మెడలో చైన్ స్నాచింగ్
టీనగర్ : మాధవరంలో ఎస్ఐ భార్య మెడలో దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నూరుకు చెందిన భూపతి. తండయార్‌పేటలో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇతని భార్య సంగీత (40). గురువారం భూపతి, సంగీత బైకులో అంబత్తూరులోగల బంధువు ఇంటికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో తిరిగి వస్తున్నారు. మాధవరం సమీపంలోగల మంజంబాక్కం వద్ద వస్తుండగా బైకులో వెనుక వస్తున్న దుండగులు హఠాత్తుగా సంగీత మెడలో ఉన్న ఏడు సవర్ల బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే సంగీత గొలుసును గట్టిగా పట్టుకుని అడ్డుకుంది. దీంతో దుండగుడి చేతికి నాలుగు సవర్ల బంగారు నగ చిక్కింది. ఈ నగతో దుండుగులు పారిపోయారు. వారి కోసం ఎస్ఐ భూపతి వెంట బడ్డాడు. అయినప్పటికీ వారు పట్టుబడలేదు. చోరీకి గురైన నగ విలువ ఎనభై వేల రూపాయని బాధితురాలు పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.