‘నవోదయ’కు ఇద్దరి విద్యార్థుల ఎంపిక
అర్వపల్లి : మండలంలోని తిమ్మాపురం ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన చామకూరి శ్రావణి, బాణోతు మహేష్‌లు 2016–17 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారని హెచ్ఎం వి.రవీందర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుడు, నవోదయ శిక్షకుడు డి.మహేష్ తెలిపారు. పాఠశాలలో నవోదయ విద్యాలయం కోసం ఐదేళ్ల నుంచి పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యారు. నవోదయ విద్యాలయానికి ఎంపిక కావడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు మహేష్‌ను హెచ్ఎం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు డి.సైదులు, వి. సైదులు, నాగరాజు, అనురాధ, అనితలు గురువారం పాఠశాలలో అభినందించారు.