యూరప్ పర్యటనకు కల్వకుర్తి ఎమ్మెల్యే
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి యూరప్ దేశాల పర్యటనకు వెళు తున్నారు. ఈ మేరకు తనకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు.
బ్రిటిష్ ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తనను వారి దేశానికి రావాల్సిందిగా కోరారని, ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటించనున్నట్లు చల్లా వంశీచంద్ వెల్లడించారు.
తన పర్యటనలో స్కాట్లాండ్ దేశ పార్లమెంట్ సమావేశాల తీరు తెన్నులను పరిశీలించడంతో పాటు ఎడింబర్గ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇండియా ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌తో సమావేశం కానున్నామని తెలిపారు.