తండ్రీకొడుకులను కాపాడబోయాడు:ముగ్గురూ మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా చామర్రులో నీటిలో మునిగిపోతున్న తండ్రీకొడుకులను కాపాడబోయి, అతనూ మృతి చెందాడు. చామర్రులో తండ్రి, కొడుకు ఇద్దరూ కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. వారు నదిలో స్నానం చూస్తూ నీటిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న ఒక వ్యక్తి వారిని కాపాడటానికి నదిలోకి దిగాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ మృతి చెందారు. వారితోపాటు కాపాడబోయిన వ్యక్తి కూడా నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.