Champawati River
-
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం .. 14 మంది మృతి.. మోదీ సంతాపం
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంపావత్ జిల్లాలో సుఖిధాంగ్-దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తనక్‌పూర్‌లో బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చంపావత్ ఎస్పీ వెల్లడించారు. కాగా మృతి చెందిన వారంతా కాకాని దండా, కతోటి గ్రామాలకు చెందిన వారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలి: కమల్ హాసన్ ప్రధాని మోదీ సంతాపం ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన సంతాపం తెలిపారు. ‘ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు -
చంపావతికి గర్భశోకం
దశాబ్ధాల తరబడి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించిన చంపావతి నదికి గర్భశోకం కలుగుతోంది. అక్రమార్కుల స్వార్థం వల్ల నది కాస్తా కాలువ స్థాయికి దిగజారిపోతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 గ్రామాలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నదిపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. నదీ తీరంలో ఆక్రమణలు చేపట్టడంతో పాటు ఇసుక అక్రమ రవాణా వల్ల నది తన రూపం కోల్పోతోంది. ఇదే తీరు భవిష్యత్‌లో కొనసాగితే నది తన ఉనికినే కోల్పోనుంది. మెంటాడ : చంపావతి నది జిల్లాకు ప్రధాన తాగునీటి వనరు. ఎన్నో దశాబ్ధాలుగా లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించిన నది నేడు కుచించుకుపోయింది. ఒకప్పుడు విశాలంగా కని పించిన చంపావతి నేడు కాలువలా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో సుమారు 65 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న నది విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి మెంటాడ మండలం ఆండ్ర కొండల మీదుగా విజయనగరం జిల్లాలో 65 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తోంది. ఆండ్ర కోట పక్క నుంచి మెంటాడ, గంగచోళ్లపెంట, గజపతినగరం, కొనిశ, గుర్ల, పూసపాటి రేగ, నెల్లిమర్ల, నడుపూరు, తదితర గ్రామాల మీదుగా ప్రవహిస్తూ చివరకు పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. మెంటాడ మండలంలోని గుర్ల గెడ్డ ఆగూరు వద్ద చంపావతి నదిలో కలుస్తుంది. అలాగే గజపతినగరం మండలం లింగాలవలస సమీపంలో ఏడొంపుల గెడ్డ కూడా చంపావతి నదిలో కలుస్తున్నాయి. గెడ్డల కలరుుకతో ఉద్ధృతంగా ప్రవహించాల్సిన నది కొంతమంది అక్రమార్కుల చేతుల్లో పడి క్షీణించిపోతోంది. ఆక్రమణ ప్రదేశాల్లో వరి, టేకు, సరుగుడు, నీలగిరి, జీడి, మామిడి పంటలు సాగు చేస్తున్నారు. మెంటాడ, గజపతినగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని ఆండ్ర, లోతుగెడ్డ, జగన్నాథపురం, పిట్టాడ, తమ్మిరాజుపేట, మెంటాడ, గజపతినగరం, మర్రివలస, గంగచోళ్లపెంట, తుమ్మికాపల్లి, లోగిశ,తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి ఆక్రమణలు జరిగినట్లు అంచనా. ఇదే సమయంలో నదిలో ఇసుక అక్రమ రవాణా కూడా గణనీయంగా పెరిగింది. ఈ రెండు కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో చంపావతి నది చిన్న కాలువలా తయారైంది. ఈ నది నీటిపై ఆధారపడుతూ ఆండ్ర, పిట్టాడ, తమ్మిరాజుపేట, ఆగూరు, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గుర్ల, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గంట్యాడ మండలాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. సుమారు 150 గ్రామాల్లోని నాలుగు లక్షల మందికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఆక్రమణలు మరింత పెరిగితే తాగునీటి సరఫరా కష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయూనికి సాగునీరు కూడా అందే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
చంపాస్తున్నారు
ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు చేస్తున్న ఆగడాలతో చంపావతి నదికి గర్భశోకం మిగులుతోంది. అక్రమార్కులు నదిని ఆక్రమించుకుని సొంతంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసుకుం టూ ఇసుకను తోడేస్తున్నారు. అధికార పక్షం అండదండలుండడంతో అధికారులు కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతూ ఇసుక మాఫియా జిల్లాలో ఎక్కడికక్కడ తిష్ఠ వేసింది. విజయనగరం, సాక్షిప్రతినిధి: చిన్న మరుగుదొడ్డి కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం కష్టమవుతున్న ఈ రోజుల్లో చంపావతి నది ఒడ్డును సైతం లాగేసి రెండు కిలోమీటర్ల దూరంలో వందల లోడ్ల ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. గజపతినగరం మండలం కెంగువ గ్రామం వెంబడి చంపావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో ఇసుక మేటలు బాగానే ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగు దేశం నాయకుడొకరు నదిలో ఉన్న ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇసుక రీచ్ మంజూరు కాకుండానే ఇక్కడి ఇసుకను గ్రామ పరిసరాల్లోనూ, పొలిమేరల్లోనూ ఎక్కడ బడితే అక్కడ డంపింగ్‌చేసి నిల్వలు పెంచుకుంటున్నారు. వర్షాకాలంలో ఇసుక ధర పెరిగి వ్యాపారం బంగారంలా సాగుతుంది. అందుకే ప్రస్తుతం తవ్వుతున్న ఇసుక అంతా అమ్ముకోకుండా కొద్ది కొద్దిగా అమ్ముతూ మరికొంత దాచుకుంటు న్నారు. మూడు నెలలుగా ఈ ఇసుక దందా జరుగుతోంది. రోజుకు 20 యూనిట్ల మేరకు నది నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. మరిన్ని ట్రాక్టర్లున్నా..!: కెంగువ అనధికార రీచ్‌లో ఇసుక తరలించేందుకు ఏ ట్రాక్టరు యజమానీ ముందుకు రాకపోవడం విశేషం. అనధికార రీచ్‌ను నడుపుతున్న టీడీపీ నాయకుడి వాహనం ఒక్కటే రోజంతా ఇసుకను తరలించి డంపింగ్ చేస్తూ నిల్వలను పెంచుతున్నారు. గ్రామంలో సుమారు ఆరు నుంచి పది ట్రాక్టర్ల వరకూ ఉన్నట్టు భోగట్టా! కానీ వీరెవరూ ఈ ఇసుకను తరలించడానికి ముందుకు రావడం లేదంటే అధికార పక్షం దన్ను ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇసుక ట్రాక్టరు లోడ్‌కు రూ.1500 నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వ్యాపారం జరుగుతుండగానే ఇసుక లోడ్లను నిల్వలు చేస్తున్నారు. కమిటీలు ఏం చేస్తున్నట్లో..!: గ్రామస్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఇసుక అక్రమ రవాణా నిరోధక కమిటీలను కలెక్టర్ ఆధ్వర్యంలో వేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే మూడు విడతలుగా భారీ జరిమానాలు అమలు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ కమిటీల్లో ఎస్సై, తహశీల్దార్, వీఆర్వో తదితరులున్నా ఎక్కడా తనిఖీలు లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని స్పష్టమవుతోంది. ఈ కమిటీలు కూడా చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా వ్యాప్తంగా విమ ర్శ లు వస్తున్నాయి. ప్రారంభంలో కాస్త కఠినంగా వ్యవహరించిన జిల్లా, మండల స్థాయి యంత్రాంగం ఇప్పుడు ఆ స్థాయిలో వ్యవహ రించడం లేదని, తిరిగి అక్రమార్కులకే వంత పాడుతూ ఇసుక రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ అక్రమ డంపింగ్‌ను నిలిపివేయాలని కోరుతున్నారు.