Chandana Chakrabarti
-
పోటీ నుంచి తప్పుకున్న చందనా చక్రవర్తి
హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి, సామాజిక కార్యకర్త చందనాచక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, స్వచ్ఛందంగానే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు డాక్టర్ సుధాకిరణ్‌ను బరిలోకి దించాలని ఆప్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. -
బహుముఖ పోరు.. ఎవరిదో టాప్ గేరు?
ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇప్పుడు ఆ సీటు మాటే. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అత్యధిక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలోనే పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా అవతరించిన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక్కడ విద్యావంతులకు తోడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన జనం పెద్దసంఖ్యలో ఉండడంతో ఆశావహులు ఈ సీటుపై కన్నేశారు. కొత్తగా పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఇక్కడి నుంచి తమ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఉండవల్లిని బరిలోకి దింపడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీ భావిస్తోంది. తద్వారా తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, లోక్‌సత్తా తరపున జయప్రకాష్ నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా చందన చక్రవర్తి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మిగతా పార్టీల తరపున రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ బహుముఖ పోరు తప్పదని అర్థమవుతోంది. మల్కాజ్గిరి సమరం రసవత్తరంగా సాగుతుందనడంతో ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. -
చందనా చక్రవర్తికి మల్కాజ్గిరి!
హైదరాబాద్: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని ప్రధాన నగరాలపై దృష్టి సారించింది. హైదరాబాద్‌లో అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని వదిలేసి మిగతా సీట్లలో పోటీకి ఆప్ సిద్దమవుతోంది. ఇందుకోసం పలువురు పేర్లు పరిశీలిస్తోంది. హట్ సీట్‌గా మారిన మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి సామాజికవేత్త, నటి చందనా చక్రవర్తిని పోటీకి దించాలని ఆప్ భావిస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మాజీ ఐఏఎస్ అధికారి ఛాయా రతన్ పేరు పరిశీలిస్తోంది. నావికాదళ మాజీ అధికారి సుధీర్ పరకాల కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్. వెంటకరెడ్డిని చేవెళ్ల నుంచి బరిలోకి దించాలని ఆప్ యోచిస్తోంది.