అన్నపై తమ్ముడు దాడి
చాగల్లు : పొలం తగాదా నేపథ్యంలో అన్నపై తమ్మడు దాడిచేసిన ఘటన గురువారం జరిగింది. చాగల్లు పోలీసుల కథనం ప్రకారం.. చంద్రవరం గ్రామంలో పొలం తగాదా నేపథ్యంలో గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి నర్సింహమూర్తిని, అతని తమ్ముడు వరప్రసాద్ కొట్టి గాయపర్చాడు. నర్సింహమూర్తిని 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ పెరవలి శ్రీను తెలిపారు.