చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చందుపట్ల చెరువు అభివృద్ధి కోసం రూ.1.50 కోట్ల నిధులను కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ చెరువుని బాగా అభివృద్ధి చేస్తే రూ 5. కోట్ల బహుమానం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తెలంగాణాలో 46 వేల చెరువులండేవని ..ఆంధ్రాపాలనలో ఇవన్నీ నాశనమయ్యాయన్నారు. రుద్రమదేవి మరణ శిలాశాసనం ఇక్కడే లభించిందని చందుపట్లకి ఉన్న ప్రాధాన్యతని గుర్తు చేశారు. చందుపట్ల పర్యాటక కేంద్రంగా చేసి ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.