charged of students
-
'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' టీచర్ అనుచిత వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని తమ టీచర్ ప్రశ్నించినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హేమా గులాటి, గాంధీ నగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయాలో పనిచేస్తున్నారు. టీచర్ తమపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబా, మక్కా, ఖురాన్‌పై కూడా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించకుండానే దేశంలో ఉంటున్నారని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించారు. పాఠశాలల్లో ఇలాంటి విద్వేషాలకు తావివ్వకూడదని చెప్పారు. ఆ టీచర్ని స్కూల్ నుంచి బహిష్కరించాలని కోరారు. సరైన అవగాహన లేని విషయాలపై టీచర్లు మాట్లాడకూడదని చెప్పారు. విద్యార్థుల్లో వైషమ్యాలను కలిగించే విధంగా పాఠాలు ఉండకూడదని అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్పై ఈ ఘటనపై స్పందించారు. టీచర్ ఇలా మాట్లాడకూడదని అన్నారు. పిల్లలకు మంచి పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పారు. మతాలపై టీచర్లు తమ సొంత వైఖరిని తరగతి గదిలో మాట్లాడకూడదని అన్నారు. ఆ టీచర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీలో ఇటీవల ఓ టీచర్ తరగతి గదిలో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించింది. అయితే ఈ ఘటనలో తాను మతపరమైన ఉద్దేశంతో చేయలేదని చెప్పారు. విద్యార్థులకు బుద్ధి చెప్పే క్రమంలో ఇలా చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చుకున్నారు. ఇదీ చదవండి: Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్ .. ఏం చెప్పిందంటే! -
ఉద్యోగ ధర్మం
అరుంధతీ రాజ్యానికి రాజు అమరసేనుడు. ఆ రాజ్యానికి వివేకుడు మంత్రి, ప్రమద్వరుడు కోశాధికారి. కోశాగారంలోని బంగారం, ధనం ప్రమద్వరుడి అధీనంలో ఉండేవి. ఒకసారి అకస్మాత్తుగా ప్రమద్వరుడి దగ్గరి బంధువు మరణించిన వార్త తెలిసింది. వెనువెంటనే రాజధాని నుంచి బయలుదేరి బంధువుల ఊరికి వెళ్ళిపోయాడు ప్రమధ్వరుడు. ఆ సమయంలో రాజ్య పరిపాలన కోసం ధనం పెద్దమొత్తంలో అవసరమై మంత్రి కోశాగారం దగ్గరకు వెళ్ళాడు. తాను వచ్చినపని కాపలాదారులకు చెప్పాడు. ప్రమద్వరుడి అనుమతి లేనిదే ఎవరినీ కోశాగారంలోనికి అనుమతించమన్నారు వాళ్ళు. ‘నేను ఈ రాజ్యానికి మంత్రినని తెలియదా? కోశాగారానికి సంబంధించిన ఒక జత తాళాలు నా దగ్గరున్నాయి. అంటే నాకూ లోనికివెళ్ళే అర్హత ఉందనేకదా! మీ కోశాధికారి ప్రమద్వరుడు నేను నియమించినవాడే’ అన్నాడు మంత్రి.అందుకు వాళ్ళు ఒప్పుకోక ‘అయ్యా! మమ్ములను నియమించుకున్నది కోశాధికారి ్రçపమద్వరుడు కదా! మేము వారికి జవాబుదారీగా వుండాలికదా! ఆయన మీకు తన బాధ్యతలను అప్పజెబుతూ స్వదస్తూరీ, సంతకంతో ఇచ్చిన లేఖ వుంటే ఇవ్వండి. అనుమతిస్తాము‘అన్నారు. ప్రమద్వరుడు ఏదైనా పనిమీద రాజధాని దాటి వెళ్తున్నప్పుడుమంత్రికి లేఖ ఇచ్చి వెళ్ళేవాడు. అందులో ఏం వ్రాశాడో చూసే అవసరం తనకు ఏరోజూ రాలేదు. ఈసారి హుటాహుటిన బయలుదేరటం వల్ల, లేఖ మరచి వెళ్ళిపోయాడు. ఆ లేఖ అవసరమని మంత్రి ఏ రోజూ అనుకోలేదు. ఆ విషయం వారికిచెప్పినా ఒప్పుకోలేదు. మంత్రి వెళ్ళి రాజుకు విషయం చెప్పి ‘నన్ను కూడా లెక్క చెయ్యని వాళ్ళు ఒక్కక్షణం కూడా ఉండటానికి వీల్లేదు. తొలగిస్తాను‘అన్నాడు ఆవేశంగా.రాజు నవ్వి ‘మంత్రివర్యా! మీ స్థానంలో ఎవరున్నా కోపం రావటం సహజమే.కానీ కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించండి. వారి ఉద్యోగ ధర్మం వారు సక్రమంగా, నిజాయతీగా నిర్వహిస్తున్నారు. ప్రమధ్వరుడికి మీరు అధికారి కావచ్చు. వారికి మాత్రం ప్రమద్వరుడే అధికారి. అతనిఅనుమతి లేనిదే లోనికి వెళ్ళనివ్వని వారి కర్తవ్యనిర్వహణ ధర్మమైనదే కదా!.మన అవసరాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకుంటే, ప్రమధ్వరుడు వస్తాడు కదా,!‘అన్నాడు.మంత్రి రాజు మాటలతో ఏకీభవించి వెళ్లిపోయాడు. మరునాడు ప్రమధ్వరుడు రాగానే ఎంతో నిజాయతీపరులు, ఉద్యోగ ధర్మం పట్ల అంకితభావం కలవారిని ఎన్నికచేసి, కాపలాదారులుగా నియమించినందుకు ప్రశంసించి సత్కరించాడు మంత్రి వివేకుడు. ∙డి.కె.చదువులబాబు -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
– విద్యార్థుల నుంచి యూసీఎస్ ఫీజు వసూలు – వర్సిటీకి చెల్లించని జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు –ఫలితంగా ఆగిన సర్టిఫికెట్ల జారీ – పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం – అబ్జర్వర్లు గైర్హాజరుపై కమిటీ విచారణ జేఎన్టీయూ : జేఎన్టీయూ (అనంతపురం) అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజును ప్రతి ఏటా విద్యార్థులు నుంచి యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరంలో రూ. 5,500 , రెండు, మూడు ,నాలుగవ సంవత్సరంలో రూ. 2,500 ప్రతి విద్యార్థి ఈ ఫీజు అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాలి. అయితే ఆ మొత్తాన్ని యాజమాన్యాలు వర్సిటీకి చెల్లించడం లేదు. ఫలితంగా రూ. 10 కోట్లుపైగా బకాయిలు పడతుండడంతో వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విద్యార్థుల మార్క్‌ల జాబితాను కళాశాలలకు అందజేయడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలకు గురువుతున్నారు. వెసులుబాటు కల్పించినా.. 2016–17 విద్యాసంవత్సరం వరకూ చెల్లించాల్సిన బకాయిల అంశంలో జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు వెసులుబాటు కల్పించారు. 2014–15 విద్యాసంవత్సరంకు ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా వచ్చింది. దీంతో అప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించాలని షరతు విధించారు. అయినప్పటికీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బకాయిలు చెల్లించలేదు. సర్టిఫికెట్లు విద్యార్థికి నేరుగా ఇవ్వకుండా కళాశాలలకు పంపాలని వర్సిటీ నిబంధనలో ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం నేరుగా కళాశాలలకు, లేదా కళాశాల సూచించిన ప్రతినిధికి మాత్రమే సర్టిఫికెట్లు అందచేస్తారు. ఈ నేపథ్యంలో బకాయిలు పడ్డ యాజమాన్యాలు సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి వర్సిటీకి రావడం మానేశారు. దీంతో విద్యార్థికి సర్టిఫికెట్లు అందడంలేదు. పరీక్షల నిర్వాహణలో నిర్లక్ష్యం.. పరీక్షల నిర్వాహణలోనూ కళాశాలల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రతి పరీక్ష కేంద్రానికి అబ్జర్వర్లను నియమిస్తారు. ఆన్లైన్లో ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేయడం, ప్రింటింగ్ తీసి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు జారీ చేయాల్సిన ప్రక్రియలో కీలకంగా అబ్జర్వర్ బాధ్యత వహించాలి. కానీ పరీక్ష ప్రారంభమై, స్పెషల్ అజ్జర్వర్లు తనిఖీ చేసేంతవరకు అజ్జర్వర్లు విధుల్లో లేరని స్పష్టమైంది. ఈ అంశంపై విచారించడానికి సీనియర్ ప్రొఫెసర్ల కమిటీని నియమించారు. ఎందుకు గైర్హాజరయ్యారు? పరీక్షలు నిర్వహించడంలో బాధ్యతారాహిత్యంపై రెండు రోజులుగా కమిటీ విచారిస్తోంది.