breaking news
Charlie Kirk
-
ఈ వేలంవెర్రికి తెర పడదా?
సింపుల్‌గా.... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి ఇప్పుడేం జరిగింది?అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్‌లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!నేపథ్యం ఏమిటి?అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.గత చరిత్రఅమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.వర్తమానం... భవిష్యత్తు...అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్‌తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్‌పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన. The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020ఏంటీ ఎంటిఫా.. Antifa అంటే ఫాసిస్ట్ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ట్రంప్ గత టర్మ్‌లోనే ఈ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. కిర్క్ మరణంకన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్సన్ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం. -
చార్లీ కిర్క్ కేసులో విస్తుపోయే వాస్తవాలు!
కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైలర్ రాబిన్సన్(22).. ఎందుకు చంపాడన్నదానిపై దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కిర్క్ భావజాలమే ఆయన హత్యకు కారణమైందన్న చర్చ ఇప్పుడు అక్కడ నడుస్తోంది. చార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడు టైలర్ రాబిన్సన్(Tyler Rabinson)ను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. మాసిన గడ్డంతో.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో అతను విచారణకు హాజరయ్యాడు. నేర తీవ్రత దృష్ట్యా అతనికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తన భాగస్వామికి చేసిన సందేశాలను నేరాంగీకరంగా పరిగణించాలని కోరుతున్నారు. కోర్టు పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం.. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడైన కిర్క్ సెప్టెంబర్ 10వ తేదీన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన అమెరికన్ కమ్‌బ్యాక్ కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్న క్రమంలో.. ఓ తూటా దూసుకొచ్చి ఆయన గొంతులో దిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించి.. కాల్పుల తర్వాత గనతో ఓ వ్యక్తి ఓ భవనం మీద నుంచి దూకి పారిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీలు ఆ మరుసటి రోజే 22 ఏళ్ల రాబిన్సన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఆ సమయంలో తన రూమ్మేట్.. ట్రాన్స్‌జెండర్ భాగస్వామితో అతను జరిపిన చాటింగ్‌లో హత్యకు కారణాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతనిపై(చార్లీ కిర్క్) ద్వేషాన్ని ఇంక భరించలేకపోతున్నా. కొన్ని ద్వేషాలు ఏరకంగానూ తొలగిపోలేవు అని ఓ సందేశాన్ని తన భాగస్వామికి పంపాడతను. అంతేకాదు.. ఘటనకు సరిగ్గా వారం కిందటి నుంచి ప్రణాళిక వేసుకున్నాడని, కిర్కీని ఎందుకు చంపాలనుకునే విషయాలను గతన గదిలో ఓ పేపర్‌పై రాసుకున్నాడు. అంతేకాదు.. గదిలోని కంప్యూటర్ కీ బోర్డు కింద‘‘ అవకాశం దొరికితే చార్లీ కిర్క్‌ను అంతమొందిస్తా’’ అంటూ రాసిన ఓ నోట్ కూడా దొరికింది. అయితే ఆ నోట్‌ను అతని భాగస్వామి తొలుత ప్రాంక్‌గా భావించిందట.కానీ కాల్పుల ఘటన తర్వాత తన పార్ట్నర్కు మెసేజ్ పంపి.. అది జోక్ కాదనే విషయాన్ని రాబిన్సన్ ధృవీకరించాడు. ‘‘ఈ విషయాన్ని ఎప్పటికీ నీకు చెప్పకూడదనుకన్నా. నేను ఇప్పటివరకైతే బాగానే ఉన్నా. హత్య జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయా. దాచిన నా రైఫిల్‌ను తీసుకోవాలసి ఉంది. త్వరలో ఇంటికి వస్తానేమో. ఇందులోకి నిన్ను ఇందులో లాగినందుకు నన్ను క్షమించు. నీ కోసమే నా బాధంతా’’ అంటూ మెసేజ్‌లు పెట్టాడు. ఒకవేళ తాను దొరికిపోతే.. అధికారులు నీ దాకా వస్తారని, ఆ సమయంలో నోరు మెదపొద్దని ఆ భాగస్వామికి సూచించాడు. ఆ తర్వాత ఆ మెసేజ్‌లను డిలీట్ చేశాడు. ఇక.. ఘటన తర్వాత దొరికిన క్లూస్ ఆధారంగా పోలీసులు సెయింట్ జార్జ్‌లోని రాబిన్సన్ నివాసంలో సోదాలు జరిపారు(ఈ ప్రాంతం కిర్క్ హత్య జరిగిన ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది). ఆ తనిఖీల్లో దొరికిన ఆధారాలతో చార్లీ కిర్క్‌కు చంపింది అతనేనని నిర్ధారించుకున్నారు. అరెస్ట్ చేసి వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన రైఫిల్‌ను ఘటనా స్థలంలోని పొదల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో విచారణకు అతను సహకరించకపోయినా.. అతని కుటుంబ, స్నేహితులు కీలక విషయాలనే వెల్లడించారు. తన కొడుకు కొంతకాలంగా ఓ ట్రాన్స్‌జెండర్‌తో రిలేషన్షిప్లో ఉన్నాడని, అప్పటి నుంచి అతని ఆలోచన ధోరణి మారిందని, రాజకీయంగానూ వామపక్ష భావజాలం వైపు అడుగులేశాడని రాబినసన్ తల్లి అంటోంది. ప్రస్తుతానికి రాబిన్సన్పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ కేసు దర్యాప్తుపై స్పందించారు. డిస్కార్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రాబిన్సన్తో కొందరు చాటింగులు చేశారని, వాళ్ల వివరాలు సేకరించి విచారణ జరపుతామని ప్రకటించారాయన. కన్జర్వేటివ్ భావజాలం, దీనికి తోడు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీపై చార్లీ కిర్క్ వెల్లగక్కిన ద్వేషమే.. అతని పాలిట శాపమైంది. ఈ ధోరణిని భరించలేకనే టేలర్ రాబిన్సన్ ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడనే విషయం కోర్టు డాక్యుమెంట్ల ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది. -
చార్లీ కిర్క్ ని చంపింది ఇతడే...!
-
కిర్క్ కిల్లర్ దొరికాడు
వాషింగ్టన్: అమెరికా డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన హంతకుడు ఎట్టకేలకు దొరికిపోయాడు. 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ ఈ హత్యకు పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేశామని ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం ప్రకటించారు. హంతకుడిని బంధించినట్లు యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ధ్రువీకరించారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసింది టైలర్ రాబిన్సన్ అనే విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు ఆ విషయాన్ని తమ కుటుంబ మిత్రుడికి చేరవేశాడు. ఆ మిత్రుడు పోలీసు అధికారులను సంప్రదించి సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి రాబిన్సన్ను అరెస్టు చేశారు. తాను ఈ నేరం చేశానని అతడు ఒప్పుకున్నట్లు సమాచారం. రాబిన్సన్ ఈ మధ్య కాలంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. -
విద్వేషాలను పెంచే హత్య
ఆయనేమీ అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్నవాడు కాదు. కనీసం రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సైద్ధాంతిక ఉపకరణాలు అందిస్తున్నవారిలో... ‘అమెరికాను మళ్లీ మహోత్కృష్టంగా మారుద్దాం’ (మాగా) ఉద్యమానికి తోడ్పడుతున్నవారిలో అతి ముఖ్యుడు. మూడు పదుల వయసు లోని మితవాద క్రియాశీల కార్యకర్త చార్లీ కిర్క్‌ను యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం దుండగుడు కాల్చి చంపిన వైనం ఇప్పుడు అమెరికాను ఊపిరాడకుండా చేస్తోంది. ప్రముఖులను, ఉన్న పదవుల్లోని వారినీ భౌతికంగా నిర్మూలించాలని చూసే సంస్కృతి అమెరికాకు కొత్తగాదు. కానీ ఈమధ్య అది పెరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ ఎమెరిటా మెలిసానూ, ఆమె భర్తనూ ఇటీవలే కాల్చి చంపారు. అమెరికాలో తుపాకుల పరిశ్రమ పలుకుబడి అధికం. తుపాకి సంస్కృతిని రద్దుచేయటం మాట అటుంచి, కనీసం పరిమితులు విధించాలని చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తుపాకి కలిగివుండటం పౌరుల హక్కని, దాన్ని రద్దు చేయటమంటే జీవించే హక్కును కాలరాయటమేనని వాదిస్తారు. రిపబ్లికన్ పార్టీలో ఇలాంటివారు ఎక్కువున్నా, డెమాక్రటిక్ పార్టీలో కూడా తక్కువేం లేరు. కిర్క్ తుపాకులకు అనుకూలం. దానిపై ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు చెబుతుండగానే ఆయన హత్యకు గురయ్యారు. అమెరికాలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరిగింది. ఒక అంశంపై వాదం, ప్రతివాదం సంస్కృతి కనుమరుగవుతోంది. వినాలన్న యోచన లేదు. ఉన్నా వాదనకు జవాబు చెప్పలేక, అతనికి/ఆమెకు దురుద్దేశాలు అంటగట్టడం, అభాండాలేయటం, దౌర్జన్యానికి దిగటం పెరిగింది. ఏకీభవించకున్నా ఆ వాదనను గౌరవించాలన్న స్పృహ కొరవడింది.ఒక విశ్వాసాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చినంత మాత్రాన ఆ విశ్వాసాన్ని నిర్మూలించటం అసాధ్యం. కానీ దురదృష్టవశాత్తూ దీన్ని నమ్ముకునే ధోరణి ప్రబలుతోంది. కిర్క్ డ్రాపౌట్ అన్న మాటేగానీ అసాధారణ ప్రతిభావంతుడు. కేవలం 18 యేళ్ల వయసులోనే ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ సంస్థ నెలకొల్పి తన మితవాద భావాలను బలంగా చెప్పగలిగే ఉపన్యాసకుడిగా రూపొందాడు. ఖజానా బాధ్యతాయుత నిర్వహణ, స్వేచ్ఛాయుత మార్కెట్లు, పరిమిత పాలనా వ్యవస్థ తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చాడు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడే 22 ఏళ్ల వయసులో ‘మాగా’ ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై రిపబ్లికన్లకు ఓటేయటం వెనక కిర్క్ కృషిని గురించి చెబుతారు. అరిజోనా వంటి డెమాక్రటిక్ ప్రభావిత ప్రాంతం రిపబ్లికన్ల వైపు మొగ్గటంలో అతనిపాత్ర ప్రధానమైనది. మహిళలు, గర్భస్రావాలు, ట్రాన్స్జెండర్లు తదితర అంశాల్లోఅతని వైఖరిని చాలామంది జీర్ణించుకోలేరు. జాతి, మత, వర్ణ, లింగ వివక్షను నిషేధించే 1964 నాటి పౌర హక్కుల చట్టం పెద్ద తప్పిదమని కిర్క్ భావన. భారతీయులకు కిర్క్ తీవ్ర వ్యతిరేకి. ‘శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రావాలి... మీరంతా ఖాళీ చేసి పొండి’ అని పిలుపునిచ్చాడు.తన భావాలపై ప్రశ్నించవచ్చంటూ కాలేజీలు, వర్సిటీల సందర్శన మొదలు పెట్టాడు. ఆ భావాలను పూర్వపక్షం చేస్తే అతని వాదన బలహీనపడుతుంది. కానీ భౌతిక దాడికి దిగటం వల్ల కిర్క్ భావాల బలం పెరుగుతుంది. ఈ మరణం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలే చెబుతాయి. ‘మనది యుద్ధం. కిర్క్ నేలకొరిగిన యుద్ధ వీరుడు. వ్యక్తిగత భేదాలు పక్కనబెట్టి ఒక్కటై పోరాడాలి’ అని మితవాద వ్యూహకర్త స్టీవ్ బేనన్ పిలుపునిచ్చారు. ‘మనల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే మనకున్న ప్రత్యామ్నాయాలు రెండే– పోరాడటం లేదా మరణించటం’ అని ఎలాన్ మస్క్ అన్నారు. ‘వామపక్షవాదులారా... మనం సంభాషించుకుందాం లేదా యుద్ధానికి దిగుదాం. మీ నుంచి మరో బుల్లెట్ బయటికొస్తే ఇక ఆఎంపిక మిగలదు’ అని నటుడు జేమ్స్ వుడ్స్ హెచ్చరించారు. ఏదేమైనా ఈ వాతావరణంలో అక్కడివారే కాదు... వలసపోయినవారూ అప్రమత్తంగా ఉండక తప్పదు. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడి మగ్‌షాట్ విడుదల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్(31) హత్య కేసులో ఎఫ్‌బీఐ అధికారులు పురోగతి సాధించారు. 48గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎఫ్‌బీఐ నిందితుడు టైలర్ రాబిన్సన్ మగ్‌షాట్ (అరెస్టు సమయంలో తీసిన ఫోటో)ను విడుదల చేసింది. టైలర్ రాబిన్సన్ అనే 22 ఏళ్ల యువకుడు. యుటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్‌ను కాల్చి చంపాడు.ఈ ఘటన పట్టపగలు 3వేల మంది ప్రజల సమక్షంలో జరిగింది. రాబిన్సన్ అరెస్ట్ అనంతరం, అతని ఫోటోను ఎఫ్‌బీఐ అధికారికంగా విడుదల చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడమే కాకుండా,కేసు విచారణలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఎఫ్‌బీఐ స్థానిక పోలీసు శాఖలతో కలిసి ఈ కేసును విచారిస్తోంది. చార్లీ కిర్క్‌ను హత్య చేయడానికి నిందితుడి మోటివ్, తుపాకీని ఎక్కడి నుంచి సేకరించారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. రాబిన్సన్ను ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ ప్రాణం తీసిన నిందితుడు దొరికాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) ప్రాణాలు తీసిన నిందితుడు దొరికాడు. నిందితుడికి చాలా దగ్గర వ్యక్తులే అతడిని పట్టించినట్లు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ట్రంప్‌కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు.నిందితుడు కాల్పులు జరపడంతో కూర్చొని ప్రసంగిస్తున్న చార్లీ కిర్క్ మెడ భాగంలో తూటా దిగింది. తీవ్ర గాయం కావడంతో చార్లీ నేలకొరిగాడు. చార్లీ కిర్క్ బుధవారం యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు, అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో హత్యకు గురయ్యాడు. యుటా వ్యాలీ యూనివర్సిటీ పోలీస్ అధికారి చార్లీకిర్క్ హత్య అనంతరం మీడియాతో మాట్లాడారు.చార్లీ ఈవెంట్లో మూడువేల మందిచార్లీ కిర్క్ ఈవెంట్లో సుమారు 3వేలమంది పాల్గొన్నారు. మాటీంలో ఆరుగురు సభ్యులు ఈవెంట్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చార్లీకి సెక్యూరిటీగా తన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఈవెంట్ జరిగే సమయంలో చార్లీ క్యాంపస్‌లో లోతట్టు ప్రదేశంలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు చార్లీ కూర్చున్న ప్రదేశం నుంచి సుమారు 200 అడుగుల దూరంలో ఉన్న బిల్డింగ్ పైకప్పు నుంచి కాల్పులకు తెగబడ్డారని అన్నారు. లక్ష డాలర్ల రివార్డుకాల్పుల ఘటనపై అప్రమత్తమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 48 గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. ఇందుకోసం సుమారు 20కిపైగా ఏజెన్సీలు,వందల మంది వందలాది మంది అధికారులు.. 7వేల మందికి పైగా ప్రజల సహాయంతో రంగంలోకి దిగారు.నిందితుణ్ని అరెస్ట్ చేశారు.నిందితుడి ఆచూకీ, అరెస్ట్ చేసేలా సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల రివార్డు ఇస్తామని ఎఫ్‌బీఐ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. The FBI is offering a reward of up to $100,000 for information leading to the identification and arrest of the individual(s) responsible for the murder of Charlie Kirk on September 10, 2025, at Utah Valley University in Orem, Utah. Contact 1-800-CALL-FBI and submit photos and… pic.twitter.com/ReuzFhdm0H— FBI (@FBI) September 11, 2025 -
ట్రంప్ సన్నిహితుడి హత్య.. వెలుగులోకి సంచలన వీడియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు చార్లీ కిర్క్‌పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. కిర్క్‌ను చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు.చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్‌కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కార్మికుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. -
చార్లీ కిర్క్ ను హతమార్చిన నిందితుడిని పట్టిస్తే.. లక్ష డాలర్లు..!
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
-
Charlie Kirk: ట్రంప్ మిత్రుడు చార్లీ కిర్క్ దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం. యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ తేల్చిచెప్పారు. కిర్క్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి ఇదొక చీకటి రోజు, దేశానికి విషాదభరిత దినమని అని చెప్పారు. హంతకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అతడికి మరణశిక్ష తప్పదని పేర్కొన్నారు. తొక్కిసలాట.. విషాద ఛాయలు కిర్క్ హత్య తర్వాత యూనివర్సిటీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బుల్లెట్ పేలిన శబ్దం వినిపించడం, వెంటనే కిర్క్ కింద పడిపోవడం చూసి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 3,000 మంది ఉన్నారు. అరుపులు, రోదనలతో విషాదం అలుముకుంది. ఈ గందరగోళం మధ్యే నల్లరంగు దుస్తుల్లో ఉన్న హంతకుడు అందరి కళ్లుగప్పి సులభంగా తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, ఈ ఘటనతో వారికి సంబంధం లేదని తేలింది. అనంతరం వారిని వదిలేశారు. హత్యకు సంబంధించి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. యూనివర్సిటీ పోలీసు డిపార్టుమెంట్‌కు చెందిన ఆరుగురు అధికారులతోపాటు కిర్క్ సొంత భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే విధుల్లో ఉన్నా వేలాది మంది సమక్షంలో హత్య జరగడం గమనార్హం. మహోన్నత వ్యక్తి: ట్రంప్ తన మద్దతుదారుడైన చార్లీ కిర్క్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అతడొక మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒక పోస్టుచేశారు. వైట్‌హౌస్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. సత్యం, స్వేచ్ఛ కోసం కిర్క్ అమరుడయ్యాడని కొనియాడారు. కిర్క్ హత్యకు విప్లవæ వామపక్షవాదులే కారణమని ఆరోపించారు. కిర్క్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను ట్రంప్ గురువారం ప్రకటించారు.ఎవరీ కిర్క్? చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్‌కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కారి్మకుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు.ఇదీ చదవండి: ఆయనతో జాగ్రత్త.. ట్రంప్ మనవరాలికి నెటిజన్ల సూచనతుపాకీ స్వాదీనం కిర్క్‌కు చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ గురువారం ప్రకటించింది. దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అతడు కాలేజీ విద్యార్థి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేసింది.