బ్యాంకింగ్ సేవలపై రహస్య పరిశీలన: ఆర్బీఐ
ముంబై: కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విధానంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఒక రహస్య పరిశీలన నిర్వహించనుంది. కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కార విధానం అమలును సైతం ఈ సందర్భంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ‘చార్టర్ ఆఫ్ కస్టమర్స్ రైట్స్’ విషయంలో బ్యాంకింగ్ అనుసరిస్తున్న విధానాలపై రహస్య పరిశీలన జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. తిరువనంతపురంలో రెండురోజుల బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ 2016 వార్షిక సదస్సు మంగళవారం ముగిసిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది.